ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం ఆమంచి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌తో భేటీ అయ్యారు. మంచిరోజు చూసుకుని వైసీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆమంచి పార్టీని వీడటంపై ఇప్పటికే పలువురు మంత్రులు, టీడీపీ నేతలు స్పందించారు. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆమంచి లాంటి వ్యక్తులు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు. ఇచ్చిన గౌరవాన్ని కృష్ణమోహన్‌ నిలుపుకోలేకపోయారన్నారు. బిజీగా ఉన్నా ఆమంచితో గంట సేపు మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.700 కోట్లు ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు. గురువారం ఉదయం పార్టీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆమంచి విషయం ప్రస్తావనకు వచ్చింది.

cbn amanchi 14022019

మరో పక్క, బీజేపీ వైఖరి పై కూడా చంద్రబాబు స్పందించారు. ఎన్నికలకు ముందే బీజేపీయేతర పక్షాల కూటమి ఉంటుందన్నారు. "నేను రాష్ట్రం కోసం పోరాడుతున్నా. 5 కోట్ల ప్రజల హక్కుల కోసం ధర్మపోరాటం. బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయి. అవకాశవాదులకు టీడీపీలో స్థానంలేదు. కొందరు పోతే నష్టాలకన్నా లాభాలే మిన్న. నాపై కులముద్ర వేయాలని చూడటం దారుణం. వైసీపీ కులాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం..మరోవైపు ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ మీరిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ నిరంతర శ్రమ. ఢిల్లీలో కేజ్రీవాల్ దీక్షకు గొప్ప స్పందన వచ్చింది. మోదీ పాలనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. అన్నదాత సుఖీభవ పథకం ఒక చరిత్ర. కేంద్రం ఇచ్చిన సాయంలో అనేక ఆంక్షలు విధించింది. ఏపీలో మాత్రం రైతులందరికీ ఇస్తున్నాం" అని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు.

cbn amanchi 14022019

రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. పింఛన్‌ కింద ఏడాదికి రూ.24 వేలు, పసుపు కుంకుమ కింద ఒక్కో మహిళకు రూ.20 వేలు, రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.10 వేలు ఇస్తున్నామని, ఈ మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. జాతీయ పార్టీల నేతలతో చర్చలు ఫలప్రదం అయ్యాయని, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. చీరాలలో పార్టీ బలంగా ఉందని, నాయకులు వస్తుంటారు.. పోతుంటారు అని ఆమంచి పార్టీ వీడడంపై వ్యాఖ్యానించారు. పార్టీని అంటి పెట్టుకుని ఉన్నది కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఆశయం కోసం పనిచేసేది వారేనని కితాబిచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read