ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆ పార్టీ ముఖ్య నేతలు కొందరితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశం, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ఎన్నికల అనంతర పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 4 గంటలపాటు సాగిన ఈ భేటీలో పార్టీ కార్యకర్తలపై దాడులు, కొత్త ప్రభుత్వ పనితీరు, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకోవడం లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే స్పందించరాదని, క్యాబినెట్ ఏర్పాటుచేసి పూర్తి స్థాయిలో పాలన గాడిలోపడి వారి తీరు ఎలా ఉంటుందో చూసి అప్పుడు మాట్లాడాలని సమావేశంలో నిర్ణయించారు. నిరంతరం జనం వెంట ఉంటూ వారికి అండగా నిలవాలని, ప్రజా సమస్యలకు సంబంధించి అంశాలపై అసెంబ్లీ, బయటా గళం వినిపించాలని చంద్రబాబు సూచించారు.

cbn 05051019

టీడీపీ హయాంలో అవినీతి జరిగిపోయిందని పదే పదే చెప్పి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కొత్త ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అంశంపై కూడా చర్చ జరిగింది. అలాగే, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయం సరికాదన్న చర్చ జరిగింది 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, ఆస్తుల విభజన పూర్తిగా కాకుండా, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా భవనాలను అప్పగించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత అందులో చర్చించి అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

cbn 05051019

ఇదే సమావేశంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని ఇచ్చిన హామీల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని వేడుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదని అనడంతోనే సీఎం జగన్‌ పోరాటాన్ని మళ్లీ మొదటికి తెచ్చారని పేర్కొన్నారు. ‘ఫలితాలు వెలువడ్డాక పలుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం. గత 37 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అనేక ఎన్నికలను చూసింది. ఒకసారి మేం గెలిస్తే మరోసారి మరో పార్టీ గెలిచింది. కానీ ఎప్పుడూ ఎన్నికలు కాగానే ఇలా దాడులు, దౌర్జన్యాలు జరగలేదు. గత పది రోజుల్లోనే అనేక చోట్ల ఇవి జరగడం బాధాకరం. శిలా ఫలకాలు ధ్వంసం చేయడం, జెండా దిమ్మలు, స్వాగత ద్వారాలు పగలగొట్టడం సరైంది కాదు. తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని టీడీపీ ప్రకటన విడుదల చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read