ఈ రోజు లోటస్ పాండ్ లో ఒక అపూర్వ కలయిక జరిగిన విషయం తెలిసిందే.. ప్రతిపక్ష నేత జగన్, తిరుమల పై ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితులు భేటీ పై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘‘ఇప్పుడే టీవీలలో చెప్తున్నారు తమ్ముళ్ళు, జగన్‌ను రమణదీక్షితులు కలిశారట.. మరో కుట్రకు పథకం పన్నుతున్నారు. టీటీడీని కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలని చూసింది. చివరికి దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. తిరుమల పవిత్రతను ఎవరు దెబ్బతీసినా సహించం’’ అని చంద్రబాబు హెచ్చరించారు. చిత్తూరు పర్యటనలో ఉన్న సీఎంకు ఈ భేటీ విషయాన్ని ఆ పార్టీ నేతలు చేరవేశారు. అయితే భేటీని నిర్ధారించిన తర్వాత తనకు చెప్పాలని టీడీపీ శ్రేణులను ఆయన ఆదేశించారు.

cbn 07062018 2

మరో పక్క ఐటి మంత్రి లోకేష్ కూడా స్పందించారు.. ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేసారు "Been saying this since long & now it’s in the open. Ramana Deekshithulu called on Jagan on instructions from BJP. Shame on them for their unholy nexus. Don’t ever play games with Lord Venkateswara Swamy. He will teach you guys a lesson that you will not forget! #OperationGaruda"

cbn 07062018 3

మరోవైపు జగన్, దీక్షితులు భేటీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అన్యమతస్థుడైన జగన్‌ను రమణ దీక్షితులు కలవాల్సిన అవసరం ఏంటని టీడీపీ నేత ముళ్లపూడి రేణుక ప్రశ్నించారు. జగన్‌, రమణదీక్షితుల డైరెక్షన్‌లోనే విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీ డ్రామాలో నటులు జగన్‌, రమణదీక్షితులు అంటూ ముళ్లపూడి రేణుక దుయ్యబట్టారు. జగన్‌ను రమణదీక్షితులు కలవడంతో కుట్ర బయటపడిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఒకరోజు కాకపోతే మరొకరోజు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇస్తారని, బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.. హాస్యనటుడు బ్రహ్మానందంలా తయారయ్యారని ఎద్దేవాచేశారు. వీళ్లందరి వేషాలు హనుమంతుడి ముందు కుప్పిగంతులేనని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read