ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడం అలవాటైన ప్రత్యర్ధులు. ప్రతిపక్షం ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే సర్కారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైనే దా-డి చేయించిన అధికార పార్టీ. టిడిపి కేంద్ర కార్యాలయంపైకి గూండాల్ని పంపి ధ్వంసం చేయించి, తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ రెడ్డి లాంటి రాక్షస పాలన చూడలేదని చంద్రబాబు పదేపదే ఆందోళన వ్యక్తం చేయడం మనం చూశాం. నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఆయనపై విషప్రచారం చేసేందుకు వందల కోట్లు ఖర్చు పెట్టింది పేటీయం బ్యాచ్. నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పిన వారు ఎక్కడున్నారో తెలుగు ప్రజలంతా చూశారు. మాస్క్ ఇవ్వలేని ప్రభుత్వం అని ఆరోపించాడని దళిత డాక్టర్ సుధాకర్ని, ప్రమాదకర మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని సోషల్మీడియాలో రాత్రి వీడియో పెట్టిన ఓంప్రతాప్ తెల్లారేసరికిఏమి అయ్యాడు, అవినీతిపై అసెంబ్లీలో నిలదీసిన అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు అయ్యాడు. కష్టాల్లో ఉన్న ప్రజల్ని పరామర్శకి వెళ్లిన, బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన నారా లోకేష్ ఏ నిబంధన ఉల్లంఘించకుండా పర్యటించినా ఇప్పటివరకూ 15 కేసులు నమోదు చేయించారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తనపైనే పదేపదే దా-డు-ల-కు దిగుతున్న గ్యాంగు, ఎప్పటి నుంచో టార్గెట్ చేసుకున్న తన కొడుకుపై కూడా దా-డు-ల-కు తెగబడుతుందని చంద్రబాబు భయం. లోకేష్ పాదయాత్రకి వెళ్తున్నప్పుడు హత్తుకున్న చంద్రబాబు గారి హావభావాల్లో చాలా గంభీరంగా, ఉద్విగ్నంగా ఉన్నాయి. సైకోలతో తలపడేందుకు తన కొడుకు లోకేష్ వెళ్తున్నాడని ఆ తండ్రి హృదయం ఎంతగా తల్లడిల్లిందో ఆ ఫోటోలు, వీడియోలే మౌనసాక్ష్యాలు.
చంద్రబాబు ఉద్విగ్నంగా ఉండటం వెనుక ఇంత స్టొరీ ఉందా ? పార్టీ నేతలు ఏమంటున్నారు..
Advertisements