కాపు రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) బ్రేకులు వేసిన నేపధ్యంలో, తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపుల రిజర్వేషన్ల పై ఆందోళన అవసరం లేదని నేతలకు సీఎం తెలిపారు... 9వ షెడ్యూల్‌ను సవరించి రిజర్వేషన్లు కల్పించాలని కోరామని కాపు నేతలకు వివరించారు... అన్నీ పక్కగా స్టడీ చేసి, రిపోర్ట్ తయారు చేసి, కమిషన్ వేసి మరీ, ఈ రిజర్వేషన్ పై ముందుకు వెళ్లామని చెప్పారు... ఇదే సందర్భంలో కొంత మంది నేతలు మాట్లాడుతూ, ఇప్పుడు అభ్యంతరం చెప్పింది ఒక్క డిపార్టుమెంటు మాత్రమే అని, రాజకీయంగా కేంద్రం ఇబ్బంది పెట్టినా, కోర్ట్ కి వెళ్ళాయనా సాధించుకోవచ్చు అన్నారు...
తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉండగా, మన ప్రభుత్వం, 50 శాతానికి మించి మరో 5 శాతానికే అడిగింది... బీసిలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని, జాగ్రత్తగా అన్ని విధాలుగా కమిషన్, రిపోర్ట్ తయారు చేసి పంపించింది... అయితే, కేంద్ర ప్రభుత్వం శాఖ అయిన డీవోపీటీ మాత్రం, బలమైన ప్రాతిపాదికలు ఏమిటో స్పష్టం చేయలేదని అభిప్రాయపడింది... కాని అది అవాస్తవం అని, అధికారులు అంటున్నారు... తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల కోటాను 6 నుంచి 9 శాతానికి, ముస్లిం కోటాను 4 నుంచి 12 శాతానికి పెంచాలని ఎప్పుడో కేంద్రానికి పంపించింది... ఏపీ సర్కారు కాపు కోటా బిల్లును రెండు నెలలు క్రిందట పంపించింది.. ఎప్పుడో తెలంగాణా పంపించిన దాని పై కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏపీ పంపిన కాపు బిల్లును మాత్రం ‘నిలిపి వేయాలి’ అని ఆగమేఘాల మీద తేల్చేయడం గమనార్హం.... మరో ఘోర తప్పిదం ఏంటి అంటే, డీవోపీటీ ఇచ్చిన లెటర్ లో, ఆంధ్రపదేశ్ బదులు తెలంగాణా అని రాసారు... ఇది ఆ విభాగం నిర్లక్ష్యానికి పరాకాష్ఠ...
మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటితే కోర్టు ముందు నిలవదన్నది అందరికీ తెలిసిందే. అందుకే... కాపు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించింది. దీనిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. జస్టిస్ మంజునాథ నేతృత్వంలో బీసీ కమిషన్‌ను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. కాపుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి... వారికి విద్యా, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసింది. దీనికి సంబంధించి పెద్ద నివేదికే ఉంది. కాపులకు కోటా ఇవ్వాల్సిన అవసరం ఉందనేందుకు ఈ నివేదికే ఆధారం. అయితే... 50 శాతానికి మించి కోటా ఎందుకు, ఏ ప్రాతిపదికన ఇవ్వాలో ప్రభుత్వం వివరించలేదంటూ డీవోపీటీ తన లేఖలో ఒక్క ముక్కలో తేల్చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.