8 ఏళ్ళ తరువాత, మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ కేసులో, నాన్ బైలబుల్ అరెస్ట్ వారంట్ ఇవ్వటం పై చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో స్పందించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బాబ్లీపై నోటీసులు పంపింది మీ (బీజేపీ) ప్రభుత్వమేనని ఆయన విష్ణుకుమార్ రాజును ఉద్దేశించి అన్నారు. తాను నాటకాలాడుతున్నానని అంటున్నారని.. ఇది సరికాదని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో, మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. అరెస్ట్ వారెంట్ పంపింది కాక, డ్రామాలాడుతున్నారంటూ తిరిగి మమ్మల్నే విమర్శిస్తారా? అంటూ మండిపడ్డారు. ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన వారెంట్ పై చర్చిస్తున్నామని... ఏం చేయాలి? అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

cbn notiece 17092018 2

ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతోందని 2010లో తాము బాబ్లీ నిరసన చేపట్టామని చంద్రబాబు తెలిపారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారకూడదనే తాము పోరాడామని చెప్పారు. ఆ సందర్భంగా తమను నిర్బంధించారని... వివాదం ముదరడంతో, ఎలాంటి కేసు లేదంటూ బలవంతంగా విమానం ఎక్కించి తమను అక్కడ నుంచి హైదరాబాదుకు పంపించేశారని అన్నారు. తనకెప్పుడూ నోటీసులు రాలేదని చెప్పారు. తెలుగు ప్రజల కోసం తానెప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని... ఉత్తర తెలంగాణకు అన్యాయం జరగకూడదనే ప్రతిపక్ష నేతగా తాను పోరాడానని చెప్పారు.

cbn notiece 17092018 3

మరో పక్క, రాష్ట్ర మంత్రులు, తెదేపా ముఖ్య నేతలు, అధికారులతో చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు. బాబ్లీ ఎపిసోడ్, వారెంట్ల జారీ అంశంపై వారితో సమాలోచనలు జరిపారు. గతంలో ధర్మాబాద్ కోర్టు నుంచి నోటీసులు, వారెంట్లు ఏమైనా వచ్చాయా ? అని సీఎం అధికారులను ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎటువంటి నోటీసులు, వారెంట్లు జారీ కాలేదని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం తాజాగా జారీ అయిన అరెస్ట్ వారెంట్ అందినట్టుగా చంద్రబాబుకు అధికారులు సమాచారం ఇచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టుకు వెళ్దామని చంద్రబాబు అనగా.. ప్రత్యామ్నాయాలు పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలని పలువురు నేతలు ఆయనకు సూచించినట్టు సమాచారం. మంగళవారం మరోసారి నేతలతో చర్చించి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read