రాష్ట్ర రాజకీయం మొత్తం, ఇప్పుడు కేంద్రం పై అవిశ్వాసం అనే అంశం పై జరుగుతుంది... తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, ఈ విషయం పై స్పందించారు... చంద్రబాబు మాట్లాడుతూ "విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేస్తారనే బీజేపీతో కలిసాం... మూడున్నర ఏళ్ల అయినా ఇంకా హామీలు నేర వేర్చ లేదు... 29 సార్లు ఢిల్లీ వెళ్లి ఆదుకోవాలని చెప్పా... బడ్జెట్లో మనకు ఏమీ ఇవ్వలేదు... మనకు అన్యాయం జరిగిందని చెప్పిన పార్టీ పోరాడిన నేతలు టీడీపీ వారే... కొందరు నేతలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు" అని అన్నారు...
లాలూచీ పడ్డారని కొందరు విమర్శలు చేస్తున్నారని, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చంద్రబాబు అన్నారు... ప్రజలకు అన్యాయం జరిగితే సీఎం గా ఉపేక్షించను అని, ప్రజల తరుపున పోరాడుతానని చంద్రబాబు అన్నారు.... ఎలాంటి త్యాగాలకు అయినా సిద్ధం అని చెప్పారు.... రాజీనామా లు చేస్తే పార్లిమెంట్ లో పోరాడే వారు ఎవరుంటారు, దాని వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.....
అవిశ్వాసం పై మాట్లాడుతూ "గతంలో రాజీనామాలు చేస్తామన్న వైకాపా ఇప్పుడు డ్రామాలు ఆడుతోంది... అవిశ్వాసం అంటున్నారు... అది ఆఖరి ప్రయత్నం కావాలి... మనం అవిశ్వాస తీర్మానం పెట్టలేము... 50 మంది పైగా మద్దతు కావలి... అవసరమైతే ఇతర పార్టీల సాయం తీసుకుని అవిశ్వాసం దిశగా ముందుకు వెళతా... నేనేదో అవిశ్వాసం పెట్టడం ఇష్టం లేక మాట్లాడినట్టు కొందరు వక్రీకరించారు... అది ఆఖఃరి ప్రయత్నం మాత్రమే కావాలి... అప్పటి వరకు పోరాటమే మా పార్టీ మార్గం" అని చంద్రబాబు తేల్చి చెప్పారు....