సీబీఐ నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్న అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను రాత్రికి రాత్రి సెలవు పై పంపి తాత్కాలిక సీబీఐ చీఫ్‌గా ఎం.నాగేశ్వరరావును కేంద్రం నియమించడం, అలాగే సీబీఐలో జరుగుతున్న రచ్చ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మోదీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందన్నారు. రాఫెల్ స్కాంపై విచారణ చేస్తారనే భయంతోనే సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారని చెప్పారు. ప్రధాని వద్ద పనిచేసే ఆస్థానాను కాపాడటం కోసమే డైరెక్టర్‌ను మార్చారన్నారు. సీవీసీ అనుమతులు లేకుండా సీబీఐ డైరెక్ట్‌ను ఎలా మారుస్తారని ప్రశ్నించారు. సీబీఐ డైరెక్టరుగా నియామకం జరిగిన తర్వాత రెండేళ్లు కొనసాగించాలని చెప్పారు.

cbi cn 24102018 2

సీబీఐలో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదని మొదట నుంచి పోరాడుతున్నామని అని అన్నారు. డైరెక్టర్ వద్ద డాక్యుమెంట్ ఉంటే ఇబ్బందని ఆయన్ను అనధికారికంగా తప్పించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ చాలా కుట్రాలు పన్నుతోందని అన్నారు. మరో పక్క, డీఎంకే అధ్యక్షుడు ఎం.స్టాలిన్ కు మోడీని తప్పుపట్టారు. మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, నాగేశ్వరరావు పై సీబీఐ డైరెక్టర్ (అలోక్‌ వర్మ)కు చాలా ఫిర్యాదులు వెళ్లాయని, దీనిపై దర్యాప్తు ప్రారంభించాలని కూడా అలోక్‌వర్మ అనుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో అలోక్‌వర్మను సెలవుపై పంపి నాగేశ్వరరావుకు సీబీఐ పగ్గాలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రాఫెల్‌పై విచారణ జరక్కుండా ఉండేందుకు తీసుకున్న చర్యగా ఈ నియామకాన్ని భావించవచ్చా? అని స్టాలిన్ విమర్శించారు.

cbi cn 24102018 3

పశ్చిమ్ బంగా ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సీబీఐని బీబీఐ అంటూ కొత్త పేరు పెట్టారు. ‘సీబీఐ ఇప్పుడు అతి తెలివి బీబీఐ (భాజపా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) గా మారిపోయింది. చాలా దురదృష్టకరం’ అని ఆమె ట్వీట్‌ చేశారు. సీబీఐ కార్యాలయాల వేదికగా చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ పలు ఆరోపణలు గుప్పించారు. ‘సీబీఐ డైరెక్టర్ ని సెలవుల మీద ఎందుకు పంపారు? లోక్‌పాల్‌ చట్టం ద్వారా నియమించిన దర్యాప్తు సంస్థ అధికారి పై మోదీ ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం చర్యలకు ఆదేశించింది? ఆయన సర్కారు ఏ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది?’ అని ఆయన ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read