శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బీభత్సాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యంక్ష్యంగా పరిశీలించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ``తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమై తీవ్ర నష్టం జరగడంతో మనం అవస్థలు పడుతున్నాం.. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మనం అడిగిన ప్రత్యేక హోదా విభజన చట్టం అమలు చేయమంటే మాపై ఐటీ దాడులు చేస్తూ ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తోంది. వరుసగా ప్రజాప్రతినిధులు రామారావు, ఎంపీ సుజనా చౌదరి, నేడు సి ఎం రమేష్ ఇళ్ళపై ఐటీ దాడులకు పాల్పడ్డారు. ఈ రాజ్యసభ సభ్యులు ఆనాడూ , ఇప్పుడు పూర్తిస్థాయిలో విభజనపై పోరాడారు. ప్రత్యెక హోదా సాధనకోసం శ్రమించారు. ఎన్డీఎ అన్యాయంపైనా గళమెత్తారు. అందరి సహకారం తీసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం రమేష్ నిరాహార దీక్ష చేశారు.న్నారాష్ట్రం కోసం ఇన్నిఆందోళనలు చేసే వారిపైనే ఐటీ, రాజకీయ దాడులు చేస్తున్నారు.బీజేపీకి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యర్ధిగా కనపడుతున్నారా?
తిత్లీ తుపాను నష్టాన్ని ఎదుర్కోవడానికి అందరం నిమగ్నమయితే దాడులు చేయడం ఏమిటి? ఏం చెప్పాలి. ఎవైనా మాట్లాడితే వాళ్ళను మూసేయాలి, మాట్లాడటానికి లేదు అడగటానికి లేదని దాడులు చేస్తారా? విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు పోరాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐటీ దాడులు చేయలేదు. కేంద్రాన్ని ఎదిరిస్తే ఆర్థికంగా దెబ్బతీయడానికి ఇంకెవరూ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా తప్పుడు పనులు చేస్తున్నారు. మాపనిలో మేమున్నాం ...తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకుండా కేంద్రం కుట్రపూరిత చర్యలను ప్రజలు, దేశం గమనిస్తోంది. ఇది మంచి పద్దతి కాదు... ప్రజాస్వామ్యానికి హానికరం. ఆ విషయాన్ని కేంద్రం గుర్తు పెట్టుకోవాలి. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి.. తప్పు చేస్తున్న వాళ్లకు మాత్రం కేంద్రం నాయకులు అండగా ఉంటున్నారు.
మీ ఆసరా, విధానాల వలన చాలామంది విదేశాలకు పారిపోతున్నారు. రాఫెల్ విమానాల కొనుగోళ్ళు పెద్ద స్కాం. ఇష్టం లేనివారిపై దాడులు ...ఇష్టమైన వారిని పక్కన పెట్టుకుని వంత పాడే పరిస్థితి ఉంది. దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా.. గర్హిస్తున్నా . దాడులతో మా ఆత్మస్థైతుఆన్ని ధ్యాసను దేబ్బతీయలేరు, మా పనుల నుంచి పక్క దారి పట్టించలేరు.. రాష్ట్రంలో ఇన్ని కష్టాలు ఉంటే ప్రజలకు సేవచేయనీయకుండా అడ్డుపడుతున్నారు. పని చేయనీయకుండా మానసికంగా మనోభావాలు దెబ్బతీసే రీతిలో ప్రవర్తిస్తున్నారు. కేంద్రం చర్యలను ప్రజలు గమనించాలి గుర్త పెట్టుకోవాలి ఎం చేయాలో ఎప్పటికపుడు ఆలోచించుకుని ముందుకు పోతాం. బీజేపీ చెప్పిన పని, హామీ అమలు చేయకుండా ఇంకా అన్యాయం చేస్తున్నారు... అందుకే రాష్ట్రానికి న్యాయం జరగడానికి ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవద్దా ? రాష్ట్రప్రయోజనాలు కాంక్షించే వారంతా ఒక్కతవ్వాలి, అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.