గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్, సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసు.. అయితే, తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదనతో స్పందించారు. ఆయన సోమవారం అసెంబ్లీలో, ఈ విషయం పై మాట్లాడుతూ కులాలకతీతంగా పెళ్లిళ్లు జరిపించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. అహంభావంతో చంపించే పరిస్థితికి దిగజారడం బాధాకరమన్నారు. పెళ్లికానుక తేవడంలో ముఖ్య ఉద్దేశం కులాంతర వివాహాలను ప్రొత్సహించడమేనని ఆయన అన్నారు. సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, అందుకే చంద్రన్న పెళ్లికానుక విషయంలో కులాంతర వివాహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నారు.

miryalaguda 18092018 2

మిర్యాలగూడలో ఇద్దరు కులాంతర వివాహం చేసుకుంటే తక్కువ కులం అనే ఉద్దేశంతో యువతి తండ్రే చంపించాడంటే, సమాజంలో ఎంత మూఢనమ్మకం, అహంకారం ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. అబ్బాయి మంచివాడు అయినప్పుడు, అమ్మాయి నచ్చినప్పుడు, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటామని భావించినప్పుడు తల్లిదండ్రులు వాళ్లను ఆశీర్వదించాలని చంద్రబాబు అన్నారు. ఒకవేళ ఇష్టం లేకపోతే వాళ్లని వదిలేయాలన్నారు. అంతేకాని దారుణంగా చంపించడంవల్ల అతను సాధించిందేమీ లేదని చంద్రబాబు పేర్కొన్నారు.

 

miryalaguda 18092018 3

ఈ పరువు హత్య కేసులో ప్రణయ్‌ భార్య అమృత తండ్రి మారుతీరావు, అతడి తమ్ముడు శ్రావణ్‌కుమార్‌, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ప్రణయ్‌ను హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రణయ్‌ హత్య కేసులో హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన రౌడీషీటరే హంతకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీం స్నేహితుడు ఖాసీం ద్వారా రాయబారం నడిచినట్లు సమాచారం. ఖాసీం ద్వారా అబ్దుల్‌బారీ అనే వ్యక్తి హంతకుడిని పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో భారీ మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. హంతకుడికి రూ.10 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read