కాంగ్రెస్‌తో కలిస్తే ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసినట్లుగా ప్రధాని మోదీ మాట్లాడటం దారుణమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. బాధ్యత నుంచి తప్పించుకోవాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు పురస్కారం ఇస్తారని, డబ్బులు ఇవ్వరని కేంద్రం తీరుపై చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. మోదీ తన దగ్గర ఉన్న డబ్బుతో ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈవీఎంలతో ప్రజాస్వామ్యాన్ని చిప్ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు అప్పగిస్తారా అని ఎద్దేవా చేశారు.

cbn 24122018 3

పేపర్ బ్యాలెట్ విధానానికి వెళ్తే సమస్య ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. అమెరికా వంటి అనేక దేశాలలో ఈవీఎంలను విశ్వసించట్లేదని, పేపర్ బ్యాలెట్ విధానాన్నే అనుసరిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై మోదీ ప్రభుత్వానికి నమ్మకం లేదని చంద్రబాబు విమర్శించారు. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కు ఎదో నమ్మక ద్రోహం చేసారు, అంటున్నారని, కాని మేము ఎన్టీఆర్ బాటలో నడిచి, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కుంటున్నామని అన్నారు.

cbn 24122018 2

ఇటీవలి కాలంలో మీరు ఎన్ని స్థానాల్లో గెలిచారో చెప్పాలని చంద్రబాబు బీజేపీ నేతలను ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్క స్థానానికి పరిమితం అయ్యారని, వచ్చిన ఓట్ల కంటే బీజేపీ నేతలు తిరిగిన హెలీకాప్టర్లే ఎక్కువని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. అవగాహన లేకుండా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ప్రకటిస్తే... దాన్ని కూడా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.అసాధ్యం అనుకున్న పోలవరాన్ని సుసాధ్యం చేస్తున్నామని, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరించలేదని చంద్రబాబు పేర్కొన్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read