బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడో 8 ఏళ్ళ నాటి కేసు ఉన్నట్టు ఉండి ఎందుకు తిరగదోడారు ? ఎవరు ఈ పని చేసారు ? ఇప్పుడు ఈ రాజకీయ కక్ష ఎందుకు అనే చర్చ మొదలైంది. ఈ తరుణంలో, చంద్రబాబు స్వయంగా ఈ విషయం పై స్పందించారు. ఈ రోజు మధ్యాహ్నం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి చంద్రబాబు హారతిచ్చారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, బాబ్లీ ఎపిసోడ్, నాన్ బెయిలబుల్ వారెంట్ల పై మొదటి సారి స్పందించారు.

cbnreaction 14092018

"బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడాను. ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని పోరాటం చేశాను. కానీ బాబ్లీ కేసులో నాకు నోటీలిచ్చామని అంటున్నారు. నేను నేరం చేయలేదు.. ఘోరాలు చేయలేదు.. అన్యాయం అస్సలే చేయలేదు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని బాబ్లీని వ్యతిరేకించాను. నేనేం తప్పు చేయలేదు.. ఏం చేస్తారో చేయండి అని ఆ రోజే పోలీసులకు చెప్పాను. ఇప్పుడు నోటీసులు.. అరెస్ట్ వారెంట్లు అంటున్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తాను. ఏ రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చిందో ఆలోచించాలి" అని ఈ సందర్భంగా బాబు చెప్పుకొచ్చారు.

 

cbnreaction 14092018

ఎనిమిదేళ్ల తర్వాత బాబ్లీ కేసును బయటకు తీయడం ఆశ్చర్యంగా ఉందని ఈ కేసులో చంద్రబాబుతో పాటు నోటీసు అందుకున్న, మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. చంద్రబాబు వెంట ఏపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని...బాబ్లీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర సరిహద్దులో పోరాటం చేశామని తెలిపారు. సరిహద్దులో మహారాష్ట్ర పోలీసులు లాఠీచార్జ్‌ చేసి తమను చితకబాదారని గుర్తు చేశారు. ఆరోజు కేసు ఉపసంహరించుకున్నామని మహారాష్ట్ర పోలీసులు చెప్పారని మంత్రి తెలిపారు. ఆనాడు ఏపీ, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నాయని, వాళ్లే మాట్లాడుకుని ఖర్చులు భరించి విమానంలో తమని పంపారని పేర్కొన్నారు. కేసు ఉపసంహరించుకోకుండా తమని ఎలా పంపించారని ఆయన ప్రశ్నించారు. కేసు నమోదు అయ్యిందని బెయిల్‌ ఇచ్చామని కూడా చెప్పలేదన్నారు. కేసు ఉపసంహరించుకోకుండా తమని పంపించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read