గుజరాత్ లో బీజేపీ గెలిచింది అంటే, అది నా వల్లే అన్నంత బిల్డ్ అప్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత, ఎమ్మల్సీ సోము వీర్రాజు... 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది మేమే నిర్ణయిస్తామని కామెడీ చేశారు.. ఎవరు ఆపినా ఇది ఆగదు అని, ఇది జరిగి తీరుతుంది అని అన్నారు.. తెలుగుదేశంతో పొత్తు ఉన్నా, మేము వారికి ఎన్ని సీట్లు కావాలో ఇస్తాం కాని, వారు ఇస్తే మేము తీసుకోము అని అన్నారు... గుజరాత్ లో 8 శాతం ఓట్లతో గెలిచామని, ఇక్కడ తెలుగుదేశం ముక్కి మూలిగి 2 శాతం ఓట్లుతో మాత్రమే గెలిచింది అని అన్నారు.... తెలుగుదేశంతో కలిసి వీరు పోటీ చేసింది మర్చిపోయారు.. సోము మాటలకు, తెలుగుదేశం పార్టీ నాయకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ మండిపడుతూ, తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
‘ఏదో సినిమాలో హీరో అంటాడు ‘ఎప్పుడొచ్చామనేది కాదు అన్నయ్యా, బులెట్ దిగిందా? లేదా?’ అని.. అలానే, ఎంత పర్సంట్ కాదు కావాల్సింది వీర్రాజు గారు.. గెలిచామా? లేదా? అనేది ముఖ్యం. ఎవరు ఎలా గెలిచారనే దానిని ప్రజలు చూస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు ఎలా జరిగాయి? అక్కడ ఏం జరుగుతోంది? ఆంధ్రాలో ఏం జరుగుతోంది? అనేవి పత్రికల్లో, మీడియాలో వస్తున్నాయి. టీడీపీని ఎక్కడ పెట్టాలి? బీజేపీని లేదా ఇంకెవరినైనా ఎక్కడ ఉంచాలనే దానిని అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు’ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఊహించని విధంగా స్పందించి, తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు...
సోము వీర్రాజుని లైట్ తీసుకుని, సొంత పార్టీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోము వీర్రాజు లాంటి వారు చేసే వ్యాఖ్యలను వారి విచక్షణకే వదిలివేయాలని, మనం మిత్ర ధర్మం పాటిస్తున్నాం అని, ఇలా మాట్లాడవద్దు అని చంద్రబాబు అన్నారు. పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై ఎవరూ స్పందించవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ బలంతో ఎమ్మల్సీ అయిన విషయం మర్చిపోయారు అని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయనకి వ్యక్తిగత ఎజెండా ఉంది అని, ఆయన ట్రాప్ లో పడవద్దు అని పార్టీ వర్గాలకు చెప్తున్నాయి.. ఇంత దిగజారి మాట్లాడినా, చంద్రబాబు ఎంతో హుందాగా స్పందించారు అని, చంద్రబాబు లాగే, ఆయన వాగుడుని, ఆయన విచక్షణకే వదిలెయ్యాలి అని తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆదేశాలు వెళ్ళాయి..