వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ రాష్ట్రానికి న్యాయం చేయమంటే తన పై పర్సనల్ కామెంట్స్ చేసి, ఆత్మ స్థైర్యం దెబ్బతియ్యటానికి చూస్తున్నారని అన్నారు. చనిపోయిన తన తల్లిదండ్రులను నిందించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా తల్లి, తండ్రి దైవంతో సమానమని.. వారిని నిందించడం భారతీయ సంప్రదాయమా ? ప్రధాని కాళ్లకు మొక్కడమే భారతీయ సాంప్రదాయమా ? అని సీఎం ప్రశ్నించారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఇటువంటి వాళ్లను ప్రధాని కార్యాలయం ఎలా చేరదీస్తుందన్నారు. ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తానన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. నిన్న విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుని అనరాని మాటలు అన్నాడు... బజారులో ఉండే మనుషుల భాష మాట్లాడాడు... ‘ఒక తల్లీ, తండ్రికి పుట్టినవాడెవడూ చంద్రబాబులా మాట్లాడరు...’ అంటూ చంద్రబాబుని నీఛాతి నీఛంగా మాట్లాడారు..
విజయసాయి రెడ్డి మాటల పై, సామాన్య ప్రజలు కూడా మండిపడుతున్నారు.. ఇదే రాజకీయం ? ఇదేనా రాజకీయ నాయకులు మాట్లాడే భాష ? చంద్రబాబు తల్లి దండ్రుల గురించి మాట్లాడే నీచ సంస్కృతికి ఇలాంటి వాడు దిగజారాడు అంటే, ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్యంగా రెచ్చిపోతున్న లోటస్ పాండ్ పైడ్ బ్యాచ్, కూడా ఇలాగే మాట్లాడుతుంది కదా ? ఒక ఆర్ధక నేరగాడు, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో A2, 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, బెయిల్ పై బయట తిరుగుతున్న ఒక ముద్దాయి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఈ మిడిసిపాటు చూసి, వైఎస్ఆర్, గాలి జనార్ధన్ రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు...