ఓటమి భయం పెట్టుకున్న కేటీఆర్, తమ పార్టీ ఓటమికి చంద్రబాబే కారణం అవుతున్నారనే అసహనంతో, నిన్న ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, చంద్రబాబు అంతు చూస్తాం, ఏపి రాజకీయాల్లో వేలు పెడతాం అని చెప్పిన సంగతి తెలిసిందే. దీని పై చంద్రబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మలక్‌పేటలో తెదేపా అభ్యర్థి ముజఫర్‌ అలీకి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు, కేటీఆర్ వ్యాఖ్యల పై స్పందించారు. లంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌ తనను బెదిరిస్తున్నారని.. వారి బెదిరింపులకు భయపడేది లేదని తెదేపా చంద్రబాబు నాయుడు అన్నారు. కేటీఆర్‌ బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నారని.. బెదిరిస్తే భయపడబోమని.. అవసరమైతే కథ తేల్సుకుంటాం తప్పా.. భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

cbn 02122018

నేను అభివృద్ధి చేశానంటే కేసీఆర్, కేటీఆర్, ఆయన కుటుంబం కోసం కాదని..తెలంగాణ ప్రజల కోసం అభివృద్ధి చేశానని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో 35 ఏళ్లు ఉండి గల్లీ గల్లీ తిరిగానని.. తెలంగాణ రాష్ట్రమంటే అమితమైన ఇష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టానని చంద్రబాబు తెలిపారు. ఐటీ సిటీని హైటెక్ సిటీగా నిర్మించామని.. సైబరాబాద్ నగరాన్ని నిర్మించామని.. ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సమక్షంలో నామకరణం చేశామని చంద్రబాబు అన్నారు. కృష్ణా నీళ్లు తీసుకొచ్చి నీటి సమస్య లేకుండా చేశానని బాబు తెలిపారు. హైదరాబాద్‌ను మహానగరంగా తయారు చేశానని చెప్పారు. కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టిచ్చారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాకూటమి 5 లక్షలతో ఉచితంగా ఇల్లు కట్టి ఇస్తుందని చంద్రబాబు అన్నారు.టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు చెప్పారు.

cbn 02122018

తాను చేసిన అభివృద్ధితోనే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కి వచ్చి నివసిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నగరానికి కృష్ణా నీటిని తీసుకువచ్చి నీటి సమస్యను తీర్చానని చెప్పారు. కేసీఆర్‌ పాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు. తాను తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడ్డానని విమర్శలు చేస్తున్నారని.. దేనికి అడ్డుపడ్డానో తెలపాలని నిలదీశారు. తాను తెలంగాణలో ఆదాయాన్ని పెంచానని.. కేసీఆర్‌ దుబారా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ముజఫర్ అలీ గారిని.. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో కూడా సెక్యూలర్ గర్నమెంట్ రావాలంటే సీనియర్ మోడీ, జూనియర్ మోడీ ఓడిపోయాలని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read