దేశంలో ముందస్తు ఎన్నికల హడావిడి మొదలైంది... డిసెంబర్ లో ఎన్నికలు దాదాపు ఖరారు అయ్యాయి. పార్లమెంట్ స్థానాలకి ఎన్నికలు వస్తే, మన రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు దాదాపు వచ్చేస్తాయి. రాజకీయ పరిణామాలు పర్ఫెక్ట్ గా అంచనా వేసే చంద్రబాబు, ముందుస్తు ఎన్నికలు వస్తాయని ఎప్పటి నుంచో అంచనాతో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా కూడా కసరత్తు ప్రారంభించారు. డిసెంబర్ లో ఎన్నికలు వస్తే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ లో రైతులకు ఎలాంటి సమస్యలూ ఉండవు. అప్పటికే సాగునీటి అవసరాలకు సంబంధించిన నీటిని ప్రభుత్వం సులువుగానే అందించగలుగుతుంది.

cbn 24062018 2

వర్షపాతం తక్కువగా నమోదైనా... ఆ ఇబ్బందులు డిసెంబర్ లో కనిపించవు. పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని కృష్ణా డెల్టాకు పంపి.. శ్రీశైలం ద్వారా కనీసం వంద టీఎంసీల నీటిని రాయలసీమకు పంపగలిగినా.. తెలుగుదేశం పార్టీకి రైతుల్లో సానుకూలత వస్తుంది. ఇప్పటికే అనంతపురం లాంటి జిల్లాల్లో గత ఏడాది... పారిన కృష్ణానీరు తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం నింపింది. ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కేంద్రం సహకరించకపోయినా, రాష్ట్ర బడ్జెట్ లో డబ్బులు కేటాయించి, పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే కీలక దశలను పూర్తి చేసుకుంది. ఈ విషయంలో ప్రజలు చంద్రబాబు కృషిని గుర్తిస్తున్నారు కూడా. ఏ వర్గం అసంతృప్తికి గురి కాకుండా.. ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. హోంగార్డులు, అంగన్వాడిల జీతాలు పెంపు నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. ఇక ప్రధాన పండుగలకు అన్ని వర్గాలకు ఉచితంగా కానుకలు పంపిణీ చేస్తూ... ప్రభుత్వంపై సానుకూల ధోరణి పెరిగేలా చేసుకున్నారు.

cbn 24062018 3

చంద్రబాబు పథకాలు ప్రవేశ పెట్టడమే కాదు.. అవి అందుకున్న లబ్దిదారుల నుంచి...సరిగ్గా అందాయా లేదా అని వాకబు చేసేందుకు ప్రత్యేకంగా ఆర్టీజీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీంతో ప్రజలకు ప్రభుత్వంలో ఓ జవాబుదారీ తనం కనిపిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల స్పందన రావడానికి ఇదో కారణంగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కేంద్రం పై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో చెప్పే పని లేదు. వైసిపీ, జనసేన చేస్తున్న పనులతో, వారు బీజేపీ చెప్పినట్టు ఆడిస్తున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. టీడీపీ లేకపోతే వైసీపీ ఉందన్న కారణంగానే .. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తుందన్న ప్రచారాన్ని టీడీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీన్ని తిప్పికొట్టడంలో వైసీపీ విఫలమయింది. బీజేపీని వ్యతిరేకించలేని నిస్సహాయితతో, వైసీపీ, జనసేన ఉన్నాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వానికి ఏదన్నా ఇబ్బంది ఉందీ అంటే, అది అమరావతి నిర్మాణం మాత్రమే. రోడ్లు, తదితర ఇన్ఫ్రా పనులు వేగంగా జరుగుతున్నా, ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మాణం మొదలు కాకపోవటం ఒక్కటే ఇబ్బంది. అయితే, ఈ పనులు కూడా మరో నెలలో మొదలు కానున్నాయి. డిసెంబర్ నాటికి ఆరు నెలలు సమయం ఉంటుంది కాబట్టి, ఆ టైంకు ఒక షేప్ చూపించే అవకాశం ఉంది. మొత్తానికి, ఢిల్లీతో కుమ్మకైన ప్రతిపక్ష పార్టీలు, నీరు, సంక్షేమ పధకాలు, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, కియా లాంటి ప్రముఖ కంపెనీల పెట్టుబడులు, అన్నిటికంటే మించి జగన్, పవన్, ఢిల్లీతో కుమ్మకు, చంద్రబాబు మాత్రమే ఈ రాష్ట్రాభివృద్ధికి అవసరం అనే భావనతో, ముందస్తుకు సై అంటుంది అధికార పక్షం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read