ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం ఆయన శనివారం గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కొచ్చిన్‌లోని లులు గ్రూప్ నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు... దేశంలోనే ది బెస్ట్ కన్వెన్షన్ సెంటర్ గా దీనికి పేరు ఉంది... ముఖ్యమంత్రికి పద్మశ్రీ యూసఫ్ అలీ ఘన స్వాగతం పలికారు... పద్మశ్రీ యూసఫ్ అలీ, లులు గ్రూప్ ఫౌండర్ కూడా...
10 వేల సీటింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కన్వెన్షన్ సెంటర్, 250 గదులు, 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మాల్‌ను సీఎం పరిశీలించారు. విశాఖలో నిర్మించబోయే అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కూడా లులు గ్రూప్ నిర్మించనుంది... విశాఖలో ఇంతకంటే గొప్పగా ఉండాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. విశాఖలో నిర్మించే సెంటర్‌కు సముద్రతీరం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని, కన్వెన్షన్ సెంటర్, మాల్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని లులు గ్రూప్‌ను చంద్రబాబు కోరారు... ముఖ్యమంత్రికి పద్మశ్రీ యూసఫ్ అలీ మాల్ మొత్తం దగ్గర ఉండి చూపించారు...
అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గోవడంతో పాటు పర్యాటక రంగానికి సంబంధించి కేరళ టూరిజం శాఖ కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుంటారని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు కేరళ పర్యటన నుంచి తిరిగివచ్చి సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.