హైదరాబాద్ మెట్రో గురించి చర్చ జరుగుతున్న వేళ, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఎంత కష్టపడి మెట్రో సాధిచింది చంద్రబాబు గుర్తు చేసుకున్నారు... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు... ఆ సమయంలో మీడియా హైదరాబాద్ మెట్రో గురించి ప్రస్తావించగా, అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు... వాజపేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు మెట్రో ప్రాజెక్ట్ ను కేవలం బెంగుళూరు,అహ్మదాబాద్ నగరాలకు పరిమితం చేస్తే, పోరాడి ఆ ప్రాజెక్ట్ ను హైదరాబాద్ నగరానికి తెచ్చిన విషయాలు గుర్తు చేసుకున్నారు... అప్పట్లోనే ఢిల్లీ మెట్రో శ్రీథరన్ తో అధ్యయనం చేయించాను అన్నారు...
బెంగళూరు, అహ్మదాబాద్ మెట్రో ఎప్పుడో అయిపోయినా, తరువాత వచ్చిన వైయస్ రాజశేఖర రెడ్డి కమీషన్ ల కోసం మైటాస్ కు ప్రాజెక్ట్ అప్పచెప్పి, ఎలా ఆలస్యం చేసింది చెప్పారు... లేదంటే అది ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండెనని ఆయన అభిప్రాయపడ్డారు... ప్రస్తుతం గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ జరుగుతున్న హెచ్ఐసీసీ, అలాగే శంషాబాద్ విమానాశ్రయం ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివేనని చంద్రబాబు గుర్తు చేశారు. తనకు హైదరాబాదును అభివృద్ధి చేశానన్న సంతృప్తి ఉందని, అది చాలని చెప్పారు. ప్రారంభోత్సవాల్లో నేను ఉన్నా.. లేకున్నా హైదరాబాద్ అభివృద్ధిలో నా కృషి ఉందంటూ మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు చంద్రబాబు..
చంద్రబాబు ఇలా అన్నారో లేదో, లోటస్ పాండ్ పైడ్ బ్యాచ్, ఎగతాళి చెయ్యటం మొదలు పెట్టారు... చంద్రబాబు హైదరాబాద్ కు మెట్రో సాధించారు అనేది నిజం... ఇప్పుడు మెట్రో మొదలైన సందర్భంలో చంద్రబాబు ఆ విషయాలు గుర్తు చేసుకున్నారు... ఇది కూడా తప్పేనా ? వీళ్ళకి చెప్పినా అర్ధం కాదు.. ఎందుకంటే వారికి చదువు రాదు, విజ్ఞత లేదు... ఫోటోషాప్ లు చేసుకుంటూ, డబ్బులకి పని చేసుకుంటూ బూతులతో కాలక్షేపం చేసే బ్రతుకులు అవి... అయినా ఆ రోజుల్లో విషయాలు తెలీని వారి కోసం, చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా, Oct 27, 2003న, హిందూ పత్రిక రాసిన కధనం ఇది... కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనకు అంగీకరించి, మెట్రో ఆమోదించినట్టు ఈ ఆర్టికల్ లో ఉంది.... http://www.thehindu.com/2003/10/27/stories/2003102707360600.htm ఇది కూడా చాలకపోతే, వికీపీడియా లింక్ లో కూడా చూడచ్చు https://en.wikipedia.org/wiki/Hyderabad_Metro