మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలన్న అంశంపై ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. సీనియర్ బీజేపీ నేత ఎల్ కె అద్వానీ పాల్గొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన తొలి జాతీయ కమిటీ సమావేశానికిరావాల్సిందిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రధాని నుంచి ఆహ్వానం వచ్చింది. అయితే మోడీ ఆహ్వానాన్ని, చంద్రబాబు తిరస్కరించారు..
అయితే, డైరెక్ట్ గా మోడీ మీద ఉన్న కోపం చూపించకుండా, రాలేక పోవటానికి గల కారాణాలు, లెటర్ రూపంలో రాసారు.. ఇలా రాయకపోతే, మళ్ళీ గాంధీ అంటే, చంద్రబాబుకి ఇష్టం లేదు అనే మరో కట్టు కధ అల్లుతారని, ఈ ప్రచారం ఎందుకు అనే ఉద్దేశంతో చంద్రబాబు లెటర్ రాసారు... "మీ నుంచి ఆహ్వానం అందింది.. కాని మాకు ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది. క్యాబినెట్ మీటింగ్ రద్దు చేసుకుని రావటం కుదరదు. మహత్మా గాంధీ అంటే మాకు చాలా గౌరవం. అందుకే గాంధీ పుట్టిన రోజు పురస్కరించుకుని, చేస్తున్న స్వచ్చ భారత్ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నాం. ఈ విషయంలో మద్దతు ఉంటుంది. సమావేశంలో తీసుకున్న నిర్నయాలు మాకు తెలియచేయండి అంటూ, చంద్రబాబు తరుపున, ఆయన సెక్రటరీ సతీష్ చంద్ర ఉత్తరం రాసారు.
ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి, మోడీ రాష్ట్రానికి చేస్తున్న మోసం పై తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు... మరో పక్క చంద్రబాబు ఒక్కరే, మోడీతో డీ కొడుతున్నారు... జాతీయ స్థాయిలో కూడా, అన్ని విపక్షలని మోడీకి వ్యతిరేకంగా ఏకం చేస్తారు, ఫ్రంట్ పెడతారు అని వార్తలు కూడా వస్తున్నాయి...ప్రస్తుతం రాష్ట్రం ఉన్న నేపధ్యం, ప్రజల్లో ఉన్న మూడ్ చూసి, ప్రధాని మోడీతో కలిసి సమావేశం అయితే, అవి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి, చంద్రబాబు ఇలా మీటింగ్ కు వెళ్ళకుండా, తిరస్కారించారు అనే వార్తలు వస్తున్నాయి.. అదే టైంలో, సామాఖ్య స్పూర్తికి ఇబ్బంది కలగకుండా, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రల్లో చేసే, మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలకు పూర్తి సహకారం అందిస్తామని చంద్రబాబు తెలిపారు...