ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ప్రజలకు సంక్రాంతి కనుక లాంటి విలువైన గిఫ్ట్ ఇచ్చారు... చంద్రబాబు ఏంటి, తమిళనాడు ప్రజలకు సహయం చెయ్యటం ఏంటి అనుకుంటున్నారా ? చెన్నైలో తాగు నీటి అవసరాలకు ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి, చెన్నై తాగు నీటి అవసరాలకు 3.33 TMC నీరుని విడుదల చేసారు... కండలేరు జలాశయం నుంచి చెన్నై తాగునీటి అవసరాలకు ఈ సీజన్‌లో 3.33 టీఎంసీల నీరు విడుదల చేసేందుకు అనుమతిస్తూ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు...
తమిళనాడు ప్ర భుత్వ అభ్యర్థన మేరకు కండలేరు నుంచి పూండి రిజర్వాయరులోకి 3.33 టీఎంసీలను విడుదల చేస్తూ ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వు జారీ చేశారు. తెలుగుగంగ నుంచి చెన్నై నగరానికి 5 టీఎంసీల కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అందించాలని ఒప్పందంలో ఉంది... అయితే రాష్ట్ర విభజన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 3.33 టీఎంసీలు, మిగతాది తెలంగాణా నుంచి ఇవ్వాలి అని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. అయితే ఇలాంటి ఒప్పందాలు ఏ రాష్ట్రాలు పాటించవు... తెలంగాణా కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు వదిలిన దాఖలాలు లేవు... చంద్రబాబు మాత్రం, పక్క రాష్ట్రాలతో సఖ్యత ముఖ్యం అనుకుని, ఒప్పందం ప్రకారం, ప్రతి సంవత్సరం తమిళనాడు అడిగిన ప్రతిసారి, మొత్తం నీరు విడుదల చేస్తున్నారు..
చెన్నై నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో ప్రస్తుతం 46 శాతం నీటి నిల్వలో లోటు ఉంది. వర్షాలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ అక్కడి చీఫ్ ఇంజినీరు తెలుగుగంగ చీఫ్ ఇంజినీరుకు లేఖ రాశారు. చెన్నై ప్రాంతీయ చీఫ్ ఇంజినీరు వినతి మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకంది. ఆ మేరకు ప్రభుత్వం చర్చించి తక్షణమే నీటిని కండలేరు నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో చెన్నై వాసులకు తాగు నీటి కష్టాలు తీరనున్నాయి... పోయిన సంవత్సరం కూడా చంద్రబాబు, ఒప్పందం ప్రకారం చెన్నై కు నీళ్ళు ఇచ్చారు... పోయిన సంవత్సరం కూడా, ఆ రాష్ట్ర ముఖ్యంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం అభ్యర్ధన మేరకు, చంద్రబాబు నీళ్ళు విడుదల చేసారు..