టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పై చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సోమవారం గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగుజాతిగా కలిసుండాలని తాను అంటుంటే, కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసునని, ఆయనకు టీడీపీనే రాజకీయ జీవితం ఇచ్చిందన్నారు. గతంలో తనతోనే ఉన్నారని,తన అనుచరుడుగా ఉన్నారని, ఇప్పుడు తిడుతూ ఉంటే బాధనిపించదా అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఫర్వాలేదన్నారు.

cbn 261120182

హైదరాబాద్ అభివృద్ధి కోసం రాత్రి, పగలు కృషి చేశానని, మైక్రోసాఫ్ట్, ఔటర్ రింగ్ రోడ్డ, ఎయిర్ పోర్టు, ఇంకా ఎన్నో సంస్థలు నగరంలో ఏర్పాటు కావడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమన్నారు. తొమ్మిదేళ్లలో హైదరాబాదును డెవలప్ చేసినప్పుడు అమరావతిని ఎందుకు చేయలేదని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని, ఈరోజు ఒకటే చెబుతున్నానని, ప్రపంచంలోని ఐదు అద్భుత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉంటుందని చెప్పారు. అమరావతి వచ్చి చుస్తే, ఏమి జగుతుందో తెలుస్తుందని అన్నారు. 40 వేల కోట్లు విలువ చేసే పనులు ఇక్కడ జరుగుతున్నాయని, వీళ్ళు మనల్ను విమర్శిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎన్ని విమర్శలు చేసినా, తెలుగు రాష్ట్రాల అభివృద్ధినే తాను కోరుకుంటానన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతు పలికిందని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కే తమ మద్దతు అని మీటింగుల్లో వైసీపీ నేతలు చెబుతున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బీజేపీకి అండగా ఉన్నారని చెప్పారు.

cbn 26112018 3

దేశంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేసిందని చంద్రబాబు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మోదీ పూర్తిగా దెబ్బతీశారని, ఆర్బీఐని కూడా వదలిపెట్టలేదని మండిపడ్డారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, తెలుగుజాతి కోసం శత్రవుతో చేతులు కలిపానని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. దేశంలోని అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతున్నామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read