ఎన్డీఏ నుంచి బయటకు రాగానే, చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్ పెడతారని, థర్డ్ ఫ్రంట్ పెడతారాని ఇలా అనేక ఊహాగానాలు వస్తున్నాయి... ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, ఈ ఊహాగానాలు మరింత ఎక్కువ అయ్యాయి... నేషనల్ మీడియాలో ఇప్పటి నుంచే, చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై రకరకాల వార్తలు వేస్తున్నారు... చంద్రబాబు బీజేపీ, కాంగ్రెస్ సపోర్ట్ లేని పార్టీలు అన్నీ ఏకం చెయ్యటానికి ఢిల్లీ వస్తున్నారని, దేశ రాజకీయాలు మారిపోయే పరిస్థితి ఉంది అంటూ, వార్తలు వేస్తున్నారు... అయితే, ఈ వార్తల పై చంద్రబాబు స్పందించారు... సోమవారం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు..

cbn 02042018 1

ఈ సందర్భంగా, ఈ విషయం చంద్రబాబు దృష్టికి రావటంతో, ఆయన స్పందించారు.. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని...అందుకోసమే ఢిల్లీ యాత్ర చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజకీయాలను హైలెట్ చేయవద్దని...రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని హైలెట్ చేయండని జాతీయ మీడియాకు సీఎం విజ్ఞప్తి చేశారు.... ఎంపీలు కూడా, ఇదే విషయాన్ని మీడియాతో గట్టిగా చెప్పాలని, మీరు మీడియాతో మాట్లాడిన ప్రతి సారి, ఈ విషయం చెప్పండి, మనకు ప్రస్తుతం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పారు...

cbn 02042018 1

సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడమే తమ సామర్ధ్యమని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే రెండురోజుల ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు చెప్పారు. ఈ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఎంపీలంతా కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడాలని సూచించారు... ఈరోజు సాయంత్రం ఢిల్లీ వస్తున్నానని... రేపు, ఎల్లుండి ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల సాధనపై దృష్టి సారించనున్నట్లు ఎంపీలతో చంద్రబాబు అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో వివిధ పార్టీల సభాపక్ష నేతలను కలువనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వ్యక్తిగతంగా వివరిస్తానన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్రానికి అన్యాయం చేస్తే.. బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read