ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాలుగేళ్ళ పరిపాలన, నవ నిర్మాణ దీక్ష జరిగిన తీరు పై, శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక కష్టాలు, కుమ్మక్కు రాజకీయాలతో సృష్టించిన అడ్డంకులన్నింటినీ అధిగమించి ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపించామని తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు దీనికి పెద్దఎత్తున సహకరించారంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నాలుగేళ్లలో చేసిన సంక్షేమం.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనంత సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఒక వ్యక్తి జీవితచక్రంలో కడుపులో ఉన్నప్పటి నుంచి.. చిన్నతనం, విద్యార్థి దశ, ఉద్యోగం, పెళ్లి, వృద్ధ్దాప్యం, మరణం వరకు అన్ని దశల్లోను ప్రభుత్వ సాయం అందేలా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.

cbn 10062018 2

ఇదే సందర్భంలో, విలేకరులు, జగన్ ప్రస్థావన తీసుకురాగా, చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జర్నలిస్టులూ.. ఒకపని చేయండి. దేశంలోని 4 రాష్ట్రాలను ఎంపిక చేసుకోండి. ఒక్కో రాష్ట్రంలో ఒక గ్రామాన్ని ఎంచుకోండి. మీతోపాటు జగన్‌ను కూడా తీసుకెళ్లండి. మేమే పంపిస్తాం. చూసిరండి. రాష్ట్రంలో కంటే ఎక్కడైనా ఎక్కువ సంక్షేమం, ఎక్కువ బాగున్న గ్రామం ఉందేమో చెప్పండి. ఇంత సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంటే వాటిని వదిలేసి.. ఎక్కడో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఒకరిద్దరు ఇబ్బంది పడే వారు ఉంటారు. వారికి కూడా లబ్ధి చేకూర్చడానికే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం.’ అని అన్నారు. అయితే విలేకరులు మాత్రం, నవ్వుతూ ఈ ప్రతిపాదనని తిరస్కరించారు. ఆయన మా మాట ఎక్కడ వింటారు అంటూ, అన్నారు.

cbn 10062018 3

‘నేను పాదయాత్ర చేసిన సమయంలో ఏ గ్రామంలోకి వెళ్లినా ఎండాకాలం దుమ్ము.. వర్షాకాలం బురద ఉండేవి. ఇప్పుడన్నీ సిమెంటు రోడ్లు వేశాం. నాడు రోడ్డుకు ఇరువైపులా బహిరంగ మలవిసర్జన, భరించలేని దుర్వాసన ఉండేవి. ఇప్పుడు అన్ని గ్రామాల్లోనూ వందశాతం మందికీ మరుగుదొడ్లు నిర్మించాం. గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధిలైట్లను ఈ నెలాఖరుకు పూర్తిచేస్తాం. నవనిర్మాణ దీక్షలో ఇళ్ల ప్రారంభోత్సవాలకు వెళ్లాను. అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినదానికి రూ.50 వేలు, లక్ష రూపాయలు కలుపుకొని బాగా కట్టుకున్నారు. 19 లక్షల ఇళ్లు పూర్తిచేయబోతున్నాం. పాదయాత్రలో మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడవడం చూశాను. ఇప్పుడు రాష్ట్రంలో తాగునీటి కొరత లేకుండా చేశాం. 400 గ్రామాల్లో మాత్రం నీటికొరత ఉంది. అక్కడా ట్యాంకర్లతో సరఫరా చేశాం' అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read