ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజేపితో పొత్తు పై స్పష్టత ఇచ్చారు... ఈ మధ్య కాలంలో బిజేపి, తెలుగుదేశం మధ్య దూరం పెరుగుతుంది అనే వార్తలు తరుచూ వస్తున్నాయి.. బిజేపి కూడా నంద్యాల ఫలితాలకు ముందు, జగన్ ని కలుపుకోవటానికి ప్రయత్నించింది. ఒక పక్క విభజన హామీల్లో జాప్యం, మరో పక్క బిజేపి కవ్వింపులు, చంద్రబాబుని చికాకు పెడుతున్నాయి కూడా...
అయితే సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు, అక్కడ జాతీయ మీడియాతో మాట్లాడారు... విలేకరులు బిజేపితో పొత్తు పై పలు ప్రశ్నలు అడిగారు... 2019 ఎన్నికల్లో పొత్తు ఉంటుందా ? కేంద్ర సహాయం రాష్ట్రానికి అంతఅంత మాత్రమే కదా ? 2019 ఎన్నికల్లో బిజేపి ఎక్కువ సీట్లు అడుగుతుంది కదా, అంటూ పలు ప్రశ్నలు వేశారు...
దీనికి చంద్రబాబు స్పందిస్తూ, బిజేపితో మంచి సంబంధాలే కొనసాగుతున్నాయని, ఏ ఇబ్బందులు లేవని, విభజన హామీల కోసం పోరాడుతున్నామ్మని చెప్పారు... ఇదే సందర్బంలో మరో ప్రశ్నకు జవాబు ఇస్తూ, మాకు ఇంకా ఏ కేబినేట్ మంత్రి పదవి వద్దని, విభజన హామీలు త్వరతిగతిన నెరవేరిస్తే చాలన్నారు...