నిన్న తిత్లీ.. నేడు పెథాయ్ తరచు తుపాన్లు ముంచుకొస్తున్నా కేంద్రంలో చలనంలేదు.. మనం చెల్లించే పన్నులతో ఆదాయం వస్తున్నా బాధితులను ఆదుకోవటంలో వివక్ష చూపుతోంది.. ఇకపై ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పెథాయ్ తుపాను నష్టం అంచనాలు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. రియల్‌టైం గవర్నెన్స్ ద్వారా తుపాను నష్టంపై ప్రాథమిక అంచనా, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ అనంతరం సచివాలయంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, కేసీఆర్‌ ఏపీ ఎన్నికల్లో వేలు పెడతానన్నారు కదా అని విలేకరులు ప్రస్తావించగా.. వైకాపాపై చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు.

kcrcbn 18122018

తానేదో తెరాసతో పొత్తు కోసం వెంపర్లాడినట్లుగా వారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను గతంలోనే తెరాసతో కలిసి వెళదామనుకున్నానని చెప్పారు. తెలుగువాళ్లు కలిసి ఉంటే సమస్యలు జాతీయస్థాయిలో పరిష్కరించుకోవచ్చని భావించానన్నారు. తర్వాత ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా తెరాస మాట్లాడింది, కాంగ్రెస్‌ మద్దతు పలికిందని గుర్తుచేశారు. అందుకే ప్రజాకూటమి కట్టి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినట్లు చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదాకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యంతరం చెప్పనంత వరకు తానేమీ మాట్లాడలేదని, అడ్డం తిరగటంవల్లే వ్యతిరేకించాల్సి వచ్చిందన్నారు.2014లో అక్కడ పోటీ చేసిన వారు ఇప్పుడు ఎందుకు పోటీ చేయలేదని వైకాపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

kcrcbn 18122018

తెరాస గెలిచినందుకు ఇక్కడ వీరు సంబరాలు చేసుకుంటున్నారు, డబ్బులు పంపిస్తారని సంతోషపడుతున్నారని విమర్శించారు. భాజపా ఎదురుదాడి తప్ప ఏమీ చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదాకు అడ్డుపడిన టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఇక్కడి ప్రతిపక్ష వైసీపీ, జనసేన అక్కడ ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో 8 అంశాలపై శ్వేతపత్రాలు ఇచ్చామని, మళ్లీ త్వరలో ఆ అన్ని అంశాలపై ప్రభుత్వం ఏం సాధించిందో శ్వేతపత్రాలు విడుదలచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీర్ఘకాలంలో ఏం సాధించామో, స్వల్ప వ్యవధిలº ఏం సాధించామో, ఇంకా ఏం సాధించాల్సి ఉందో, విభజన హామీల పరిస్థితి తదితర విషయాలన్నీ శ్వేతపత్రాల్లో వివరిస్తామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read