తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి సభలో రాహుల్‌తో కలిసి వేదిక పంచుకున్న చంద్రబాబు తన ప్రసంగం సమయంలో కేసీఆర్ తిడుతున్న బూతులు పై స్పందించారు. కేసీఆర్‌ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఏం తప్పుచేశానని తనను తిడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్‌ అనే వ్యక్తి ఉంటాడా అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. టీడీపీ రాజకీయ జన్మనిస్తే తనను విమర్శిస్తున్నారని ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తనకు సభ్యత ఉందని, తాను కేసీఆర్‌ను విమర్శించనని, అలాంటి మాటలు నేను మాట్లాడనని చంద్రబాబు చెప్పారు.

cbnkcr 28112018

‘‘తెలంగాణ అభివృద్ధికి నేను ఏనాడూ అడ్డుపడలేదు. అనవసరంగా నన్ను కేసీఆర్‌ టార్గెట్‌ చేసుకున్నారు. ఆరోజు, ఈ రోజు ఒకేమాటపై ఉన్నాను. కేసీఆర్‌ నన్ను తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారో నాకైతే అర్థంకాలేదు. మీకేమైనా అర్థమైందా తమ్ముళ్లూ. నన్ను దూషించడం న్యాయమా? నేనేం తప్పు చేశాను? తెలంగాణ అభివృద్ధికి తెదేపా సహకరించ లేదా? తెదేపా లేకపోతే కేసీఆర్‌ అనే వ్యక్తి ఉంటాడా? తెదేపా రాజకీయ జన్మినిస్తే నన్నే విమర్శిస్తున్నారు. నాకు సభ్యత ఉంది. విమర్శించను గానీ తెలంగాణ అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నా. దేశంలో నెం.1 రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. నాలుగేళ్ల పాలన చూస్తే బాధేస్తోంది. అభివృద్ధి జరగలేదు. అప్పులు పెరిగాయి. దారుణంగా తయారైంది. ప్రజాకూటమిని ప్రజలు గెలిపించాలి. ప్రజాకూటమి ఐక్యత వర్థిల్లాలి’’అని అన్న చంద్రబాబు.. జైతెలంగాణ.. జైజై తెలంగాణ’’ అని ప్రజలతో అన్పించారు.

cbnkcr 28112018

మరో పక్క, ఎన్నికలకు ఇంకా కొద్ది రోజుల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార తెరాసకు అక్కడ మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇద్దరు కార్పొరేటర్లు తెరాసకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. ఈ రోజు ఖమ్మంలో ఎన్నికల ప్రచార సభకు వచ్చిన చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఐడీసీ) ఛైర్మన్‌, ఖమ్మం జిల్లా తెరాస మాజీ అధ్యక్షుడు బుడాన్‌ఇటీవల కారు దిగి సైకిల్‌ ఎక్కుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కూడా ఈ రోజు బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరనున్నారు. 2014 ఎన్నికల్లో బుడాన్‌ బేగ్‌ ఖమ్మం లోక్‌ సభ స్థానం నుంచి తెరాస అభ్యర్థుగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read