రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఎలా ఊగిపోతున్నాడో చూస్తున్నాం. చంద్రబాబుని ఒక చేతకాని ముఖ్యమంత్రి అంటూ, తనకు ఇష్టం వచ్చినట్టు హైదరబాద్ నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక చింతమనేని పై అయితే చెప్పే పనే లేదు. చివరకు నిన్న వింత వింతగా మాట్లాడారు. తనకి తాను ఎదో పెద్ద గొప్ప శక్తిగా ఊహించుకుంటూ, నన్ను చంపటానికి ప్లాన్ చేసారు, అది వీడియో తీసి నాకు పంపించారు, నేను భయపడును, చిన్నప్పుడే రౌడీలను కొట్టాను, మట్టి, మశానం అంటూ ఏదేదో మాట్లాడాడు పవన్. ఎలా అయినా టెన్షన్ వాతావరణం తీసుకురావటానికి, అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే పవన్ ఇంత దాడి చేస్తున్నా, చంద్రబాబు మాత్రం, తన ట్రేడ్ మార్క్ స్టేట్స్ మెన్ స్టైల్ లో స్పందించారు. ప్రాణహాని ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పడం సరికాదని, ఆయనకు ప్రాణహాని ఉందని చెబితే భద్రత కల్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలీసు వ్యవస్థపై అందరికీ నమ్మకముండాలని చెప్పారు. ఇలా స్పందిస్తూ ఉండగానే, విలేకరి మరోసారి పవన్ మీద కుట్ర, దాడి అని చెప్పి ప్రశ్నలు అడుగుతుంటే, దానికి సమాధానం చెప్తూ, "నీకు ఏమైనా ఫండమెంటల్స్ తెలుసా. ఏదిబడితే అది మాట్లాడే వాళ్ళ మాటలు పట్టుకొని, అడగడం కరెక్ట్ కాదు ఆయన భద్రత వ్యవహారం పోలీసులు చూసుకుంటారు. ఆయనకు అనుమానాలుంటే చెప్పాలి" అంటూ పవన్ చేస్తున్న గాలి ఆరోపణల పై చంద్రబాబు బదులు ఇచ్చారు.
‘‘టీడీపీకి నేర చరిత్ర లేదు. నేర రాజకీయాలకు టీడీపీ నేతలు బలయ్యారు. రాజశేఖర్ రెడ్డి ఎంత మందిని చంపాడో అందరూ చూసారు. నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని నేనే నియంత్రించాను. నేరాలను ప్రోత్సహించడం టీడీపీ విధానం కాదు. నేరచరితులను ప్రోత్సహించే సమస్యే లేదు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. రేవంత్ పై ఐటి దాడుల పై స్పందిస్తూ, "వీళ్ళు దొంగలు పట్టుకోలేరు, నేరస్తులు పట్టుకోలేరు ఇలాంటి పొలిటికల్ విక్టిమైజేషన్ చేస్తుంటారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇలానే చేస్తుంటారు. కర్ణాటక లో ఏం జరిగింది, యుపి ఏం జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇదే పని చేస్తున్నారు.
ఇది సమాజానికి మంచిది కాదు దేశానికి మంచిది కాదు" అని చంద్రబాబు అన్నారు.