చాలా రోజుల తరువాత పాత చంద్రబాబు దర్శనం ఇచ్చారు... 1999 - 2004 కాలంలో ఎలా అయితే, పని చెయ్యని అధికారులకు నిద్ర లేని రాత్రులు సృష్టించే వారో, అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అయ్యింది... కాకపోతే అప్పుడు హైదరాబాద్ లో హెలికాప్టర్ ఎక్కి, ఎటు వెళ్తారో తెలియకుండా, అప్పటికి అప్పుడు, అక్కడకు వెళ్లి అధికారులకి చుక్కలు చూపించే వారు.. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది... అంతా రియల్ టైం గవర్నెన్స్... అమరావతిలో కూర్చుని, రాష్ట్రంలో ఏ మూల ఏమి జరుగుతుంది అనే విషయం పై, సమీక్ష చేస్తున్నారు.. ఈ రోజు పత్రికల్లో, టీవీలలో వచ్చిన కొన్ని కధనాలు తీసుకుని, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కు వచ్చారు... అక్కడ నుంచే వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వరా పరిశీలించి, అక్కడ అధికారులతో ఫోన్ లో మాట్లాడి, భాద్యుల పై అక్కడి అక్కడ చర్యలు తీసుకుని, మరో సారి ఒకే ఒక్కడు సినిమా గుర్తు చేసారు.. వివరాలు ఇలా ఉన్నాయి..
రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ నుంచి రోడ్లు పరిశీలించారు ముఖ్యమంత్రి. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో రహదారుల దుస్థితి పై పత్రికల్లో వచ్చిన కధనాలను అక్కడ అందరికీ చూపించారు. వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వరా చివలూరు - కొల్లిపర రహదారానికి పరిశీలించారు... రోడ్ల సమస్య పై అధికారులు పై మండిపడ్డారు. ఇంత నిర్లక్ష్యం పనికి రాదంటూ సంబధిత అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నీ పై, నేను ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ, అక్కడ ఉన్న అధికారిని నిలదీసారు చంద్రబాబు... వెంటనే అక్కడ ఉన్న పంచాయతీ రాజ్ సైట్ ఇంజనీర్ ను సస్పెండ్ చెయ్యాలని, ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.
విజయవాడ స్వరాజ్ మైదానంలో చెత్త వేయడం పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే సమస్య పరిష్కారం చెయ్యాలని, విజయవాడ మునిసిపల్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే మరో సమస్య పై, విజయవాడ నగర పాలక సంస్థ వైద్య ఆరోగ్య అదనపు అధికారిని సస్పెండ్ చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. వర్షా కాలం కాబట్టి మునిసిపల్, పంచాయతీ రాజ్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. అన్ని నగరాలు పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్యం పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పారు. మురికి కాలువల్లో చెత్తను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. పత్రికల్లో, టీవీల్లో సమస్యలు వచ్చేదాకా కాదు, మనమే ఇలాంటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. కొందరి నిర్లక్ష్యం వల్ల చెడ్డపేరు వస్తోందని ఆయన మండిపడ్డారు.