‘‘ఎడారి ప్రాంతాలైన దుబాయ్,అబుదాబి అద్భుత ప్రగతి సాధించాయి. మత్స్యకార గ్రామం సింగపూర్ అభివృద్ధికి చిరునామా అయ్యింది.అన్ని వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరింత ప్రగతి సాధించాలి. అందుకు అందరూ సహకరించాలి,భాగస్వాములు కావాలి.అభివృద్ధికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ మారాలి.అధికారులు,ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషిచేయాలి’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నీరు-ప్రగతి,వ్యవసాయం పురోగతిపై సోమవారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

cbn review 31102017

‘‘మూడేళ్లు కష్టపడ్డాం, నీటి సమస్య అధిగమించాం. నీరు-చెట్టు, నీరు-ప్రగతి వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాం’’ అంటూ, శాశ్వతంగా నీటి సమస్యను అధిగమించడమే మన ముందున్న తక్షణ కర్తవ్యంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ సంక్షోభం పూర్తిగా సమసిపోవాలని ఆకాంక్షించారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్, అయోవా విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్ విశ్వ విద్యాలయం మన రాష్రంతో కలిసి పనిచేస్తున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పట్ల పూర్తి సానుకూలత ఉందని తెలిపారు. 3దేశాల పర్యటనలో మనపై విశ్వాసం కనిపించిందని,దానిని నిలబెట్టుకోవాలని,మరింత ప్రగతి సాధించాలని అన్నారు.

‘‘ఒక విజయం మరో విజయానికి బాటలు వేస్తుంది. కిడాంబి శ్రీకాంత్, పి.వి.సింధు వరుస విజయాలే అందుకు ఉదాహరణ.ఇదే స్ఫూర్తితో అందరూ పనిచేయాలి,తమ రంగాలలో రాణించాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకం చేశారు. అప్పట్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోపిచంద్ అకాడమీకి హైదరాబాద్ లో స్థలం కేటాయించి ప్రోత్సహించడం వల్లే మనరాష్ట్రం నుంచి అనేకమంది క్రీడాకారులు రాణిస్తున్నారని గుర్తుచేశారు.ఏ రంగంలోనైనా కావాల్సినంత ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందిస్తే అద్భుత పురోగతి సాధించవచ్చనేదానికి ఇదే ఉదాహరణగా పేర్కొన్నారు.కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అందుకే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి గత 3ఏళ్లలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు నరేగాను సద్వినియోగం చేసుకోవడం వల్ల సత్ఫలితాలు వచ్చాయన్నారు. ‘‘మన గౌరవం కాపాడుకోవాలి, ప్రజల గౌరవం నిలబెట్టాలి. ఎవరూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించరాదు’’ అని అధికారులు,ప్రజాప్రతినిధులను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read