2014లో చంద్రబాబు ఇచ్చిన అతి పెద్ద హామీ రైతు రుణ మాఫీ.. దాదపుగా 24 వేల కోట్లు. ఇది మాటలు కాదు. ధనిక రాష్ట్రాలే సాహసం చెయ్యలేనిది. డబ్బా కొట్టుకుంటే తెలంగాణా కూడా 15 వేల కోట్లతోనే ఆపేసింది. అయితే, చంద్రబాబు మాత్రం, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఇచ్చిన మాట ప్రకారం, ఆ హామీ నెరవేర్చటానికి అన్ని ప్రయత్నాలు చేసారు. ఇప్పటికే మూడు విడతలుగా రుణ మాఫీ చేసారు. 4,5 విడతలు బాకీ ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో ఉన్న ఆర్ధిక పరిస్థితి, కేంద్ర సహకారం లేకపోవటంతో, ఇది లేట్ అయ్యింది. దీంతో ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది, చంద్రబాబు ఆ హామీ నిలబెట్టుకోలేరు అనే ప్రచారానికి జగన్ సిద్ధమయ్యారు. కాని చంద్రబాబు మాత్రం, జగన్ ఆసల పై నీళ్ళు చల్లారు. కరెక్ట్ గా నోటిఫికేషన్ కు ఒక గంట ముందు, జీఓ రిలీజ్ చేసి, మోడీ వేసిన ఎత్తుకు, పై ఎత్తు వేసారు.

cbn 11032019 1

రైతు రుణ ఉపశమన పథకం కింద ఇప్పటికే మూడు విడతలుగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం 4, 5 విడతల సొమ్మును విడుదల చేసింది. 10% వడ్డీతో కలిపి రూ.8,300 కోట్లు విడుదల చేస్తూ ఆదివారం జీవో-38ని జారీ చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని 31.44 లక్షల రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు. ఈ సొమ్మును ఈ నెలలో 4వ విడత సొమ్ము, వచ్చే నెల మొదటి వారంలో 5వ విడత సొమ్ము కింద రైతుల ఖాతాలకు జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో 2014 మార్చికి ముందు వ్యవసాయ రుణాల బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేసినట్లు అవుతుంది. ఏపీ విభజన వల్ల రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా, గత ఎన్నికల సమయంలో టీడీపీ మ్యానిఫెస్టోలో రైతులకు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక ఒక్కో రైతుకు రూ.లక్షలన్నర వరకు ఉపశమనం కల్పిస్తానని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 58.29 లక్షల మంది రైతులకు రూ.24,500 కోట్లు రుణ మాఫీ చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా రైతుసాధికార సంస్థను ఏర్పాటు చేసి, 2014-15లో తొలి విడతగా రూ.50 వేల లోపు రుణాలను ఏక మొత్తంగా మాఫీ చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం రుణమాఫీ నిబంధనలు వర్తించని ఉద్యాన రైతులకూ మేలు చేయాలని భావించిన సీఎం చంద్రబాబు ఆదేశాలతో 2,22,679 ఉద్యాన రైతుల ఖాతాలకు రూ.384.47 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.

cbn 11032019 1

రుణమాఫీపై రైతులకు భరోసా కల్పించేందుకు రుణ ఉపశమన పత్రాలను జారీ చేసింది. రుణమాఫీ నిధులు విడుదల చేసినప్పుడు రైతులు ఈ ఉపశమన పత్రాలను సంబంధిత బ్యాంకుల్లో అప్‌లోడ్‌ చేయించుకుని, మాఫీ సొమ్మును ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా 2016లో 2వ విడత, 2017లో 3 విడత రుణమాఫీ చేశారు. పైగా 10% వడ్డీతో కలిపి రుణమాఫీ అమలు చేశారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గత మూడేళ్లలో దాదాపు లక్ష మంది రైతులు రుణ మాఫీ వర్తించలేదని రైతుసాధికార సంస్థకు అర్జీలు పెట్టుకోవడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, అర్హత కలిగిన రైతులకు మాఫీ సొమ్ము జమ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read