ఉండవల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ వర్క్‌షాప్ లో, ఎమ్మల్యేలు, నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, సలహాలు, సమస్యలు చెప్పుకొచ్చారు... వాటికి చంద్రబాబు సమాధానమిస్తూ, ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలో చెప్పారు.. ఈ సందర్భంలో, పెనమలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ, "అడిగిన వారికి పింక్ కార్డులు ఇవ్వాలి... గుర్తింపు కోసం వాళ్లు పింక్ కార్డు అడుగుతున్నారు.. కాబట్టి ఈ అంశం వెంటనే పరిశీలించాలి... దీనివల్ల అందరిలో సంతృప్తస్థాయి పెరుగుతుంది" అంటూ బోడె ప్రసాద్ చంద్రబాబుకి చెప్పారు...
దీంతో చంద్రబాబు సమాధానమిస్తూ,"కోళ్ల పందేలు ప్రజల సంతృప్తికే, ఆ సంస్కృతి లేని ప్రాంతాల్లో కూడా జరిపించారా" అని ముఖ్యమంత్రి సెటైర్ వేయడంతో ప్రాంగణం నవ్వులతో మార్మోగింది.... ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, బోడె ప్రసాద్ కోళ్ల పందేలు అంటూ హడావిడి చేసిన సంగతి తెలిసిందే... పోలీసు వారితో పోరాడి మరీ, కోళ్ల పందేలు నిర్వించారు బోడె... దీంతో సందర్భం రావటంతో, చంద్రబాబు బోడె కి సెటైర్ వేసారు... కోళ్ల పందేలు నిర్వహించిన మిగతా ఎమ్మల్యేల పై కూడా ఉదయం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు...
బొండా ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ "నియోజకవర్గానికి కేటాయించిన 2వేల పెన్షన్ల మంజూరులో కరెంట్ బిల్లు రూ.500 పైబడి వచ్చినవారికి ఇవ్వడంలేదు... అర్హుల జాబితాలు పెండింగ్ లో ఉన్నాయి....గతంలో ఇళ్లు కేటాయింపు పొందినవారిని అనర్హులుగా ప్రకటిస్తున్నారు... దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది.ఇళ్ల క్రమబద్దీకరణ వేగవంతం చేయాలి" అంటూ ముఖ్యమంత్రికి చెప్పారు... అలాగే జి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ "జన్మభూమి-మావూరు 9 రోజుల షెడ్యూల్ లో ఆదివారం వచ్చినప్పుడు అధికారులు పనిచేయడానికి ఇష్టపడటంలేదు కాబట్టి సండే మినహాయించి గ్రామసభలు జరిపితే బాగుంటుంది" అని అనగా... వాళ్ల తరుఫున నువ్వు మాట్లాడుతున్నావా, లేక ఇది నీ అభిప్రాయమా అని ముఖ్యమంత్రి చమత్కరించారు... మధ్యలో బ్రేక్ ఇస్తే ఆ స్ఫూర్తి ఉండదంటూ ఆ ప్రతిపాదనను కొట్టిపారేశారు.