వైకాపా, జనసేన తనమీద విమర్శలు చేస్తూ.. మోదీపై ఈగ వాలనివ్వడం లేదని దుయ్యబట్టారు. ఎవరేం చేస్తున్నారు.. ఏ పార్టీ ఏం చేస్తోంది.. నిన్న ఏం మాట్లాడారు.. ఈ రోజు ఏం చెబుతున్నారనేది ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ఈ రోజు పరిణామాలపై ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటి సభ్యులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు... భాజాపా, వైకాపా, జనసేన మూడు పార్టీల అజెండా ఒక్కటేనని.. తెదేపాపై బురద జల్లడమే సింగిల్ పాయింట్ అజెండాగా పెట్టుకున్నాయన్నారు... ఇందుకు సంబంధించి, జగన్ బహిరంగగానే మోడీతో కలిసిపోయింది కనిపిస్తుంది అని, పవన్ నాలుగు రోజులు నుంచి చేస్తున్న పనులే కనిపిస్తున్నాయి అని అన్నారు...
పోలవరం పై, గతంలో జగన్ మీడియాలో వచ్చిన అవాస్తవాలే పవన్ చెబుతున్నారని విమర్శించారు... పోలవరం పై ఇన్నాళ్ళు జగనే విషం చిమ్మారని, ఇప్పుడు పవన్ కూడా తోడయ్యరని అన్నారు... పూర్తి పారదర్శకతతో సాగుతున్న పోలవరం పనుల్లో అవినీతి అంటూ చెప్తున్న పవన్, దమ్ము ఉంటే అవి బయట పెట్టి మాట్లాడాలని సవాల్ విసిరారు... బీజేపీ నేతల ప్రోద్బలంతోనే పవన్ రెచ్చిపోతున్నారని, పోలవరం, అమరావతి పై బురద జల్లి, అవి ఆలస్యం అవ్వాలని చూస్తే, ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పారు...
తనకు, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య విభేదాలు ఉన్నాయని, అందువల్లే తనకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పై కూడా చంద్రబాబు సీరియస్ గా స్పందించారు... తనకు, ప్రధానికి మధ్య విభేదాలపై పవన్ ఆధారాలు చూపాలని అన్నారు. ఎప్పుడో ఏళ్ల క్రితం గోద్రా ఘటనలు జరిగినప్పటి సంగతి, ఇప్పుడు చెప్తున్నారని, ఒక పార్టీ అధినేత ఇలాంటి చౌకబారు విమర్శలు చెయ్యటం ఏంటని అన్నారు... తెలుగులో టాప్ నటుల్లో ఒకరైన పవన్ ఇటువంటి విమర్శలు చేస్తే, నమ్మేవారు కొందరైనా ఉంటారని, అది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తుందని, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను, సరైన ఆధారాలు చుప్పించి తిప్పికొట్టాలని, మనం ఏ తప్పు చెయ్యనప్పుడు మాటలు పడటం ఎందుకని, అదే స్థాయిలో పవన్ కు తిప్పి కొట్టండి అంటూ నేతలకు సూచించారు.