రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం, తెలుగుదేశం పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలా అని, జగన్ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటున్నాయి. ఏదో కొత్తగా తెచ్చినట్టు, ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేస్తే, అనర్హత వేటు వేస్తాం, అరెస్ట్ చేస్తాం అంటూ ప్రచారం చేస్తున్నారు. నిజానికి, ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉంది. ఇదేదో జగన్ కొత్తగా తెచ్చినట్టు డబ్బా కొట్టటమే కాని, ఇన్నాళ్ళు డబ్బులు పంచుతూ, మద్యం పంచుతూ దొరికితే ఏమన్నా సన్మానం చేసేవారా ? కాదు కదా, ఎప్పుడూ డబ్బు, మద్యం పంపిణీ చెయ్యకూడదు. కాని ఇదేదో, కొత్త నిబంధన లాగా, పెద్దగా చెప్తూ, ప్రతిపక్షాలను భయాపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక ప్రచారం చేసుకునే అవకాసం కూడా లేకుండా, కేవలం 4 రోజుల్లోనే ప్రచారం ముగిసేలా ప్లాన్ చేసారు. ఇలా అన్ని విధాలుగా, ప్రతిపక్షాలను భయపెట్టాలని ఆలోచిస్తున్నారు. దీంతో, జగన్ ఎత్తుకు, పై ఎత్తు వేస్తున్నారు చంద్రబాబు. జగన్ ఏదైతే నిర్ణయం తీసుకొన్నారో, అదే నిర్ణయంతో, జగన్ ను కూడా దెబ్బ కొట్టటానికి, చంద్రబాబు రెడీ అయ్యారు.

cbn 07032020 2

ఈ రోజు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసిపి డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకోవాలని పిలుపిచ్చారు. ఫొటోలు,వీడియో తీసి పార్టీ ఆఫీస్ కు పంపాలని కోరారు. ఎన్టీఆర్ భవన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని అన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తాం అని, ఎప్పటికప్పుడు గ్రౌండ్ నుంచి సమాచారాన్ని పంపాలని అన్నారు. మీడియాను సద్వినియోగం చేసుకోవాలని, మీరు గ్రౌండ్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ పంపిస్తే, వెంటనే అధికారులకు ఫిర్యాదులు చేస్తాం అని చంద్రబాబు అన్నారు. జగన్ ఏదైతే బూచిగా చూపి, మనల్ని భయపెడుతున్నాడో, దాంతోనే, జగన్ ను దెబ్బ తియ్యాలని, కోర్టుల్లో కేసులు వేద్దాం అని అన్నారు.

cbn 07032020 3

చంద్రబాబు మాట్లాడుతూ "38ఏళ్ల టిడిపి చరిత్రలో ఎన్నో ఎన్నికలు సమర్ధంగా ఎదుర్కొన్నాం. రేపటి స్థానిక ఎన్నికల్లో వీరోచితంగా పోరాడాలి. అన్ని చోట్ల స్ఫూర్తిదాయక నాయకత్వం ఇవ్వాలి. వైసిపి దాడులు, దౌర్జన్యాలు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎవరూ అధైర్య పడాల్సింది లేదు. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటం చేయాలి. కోర్టులలో న్యాయ పోరాటం చేయాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అందరూ ధైర్యంగా పోరాడాలి-వైసిపి వాళ్ల కథ తేల్చాలి. ఆత్మవిశ్వాసమే మన ఆయుధం. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే అందరి లక్ష్యం. ఎన్టీఆర్ టిడిపి పెట్టింది అందుకోసమే. ఒక్క అవకాశం ఇస్తే ఉన్నవి ఊడగొట్టారు. పేదల సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే ఇక ఏమీ మిగల్చరు. ఓటమి భయంతోనే మంత్రుల ఉద్యోగాలు పీకేస్తానని జగన్ బెదిరింపులు. వైసిపి ఉన్మాద చర్యలకు బుద్ది చెప్పాలి. 10% రిజర్వేషన్లు బీసిలకు తగ్గించి ద్రోహం చేశారు. సిఏఏ,ఎన్ పిఆర్ పై జగన్నాటకాలు ఆడుతున్నారు. 2,800మందిపై కేసులు పెట్టినా ఆడబిడ్డలు ధైర్యంగా పోరాడుతున్నారు. ఆడబిడ్డల పోరాటం మనందరికీ స్ఫూర్తి కావాలి. అశోక్ గజపతిరాజు గారి ఆస్తులపై కన్నేశారు. విల్లు కూడా కాదని సింహాచల భూములు లాక్కోవాలని చూశారు. అనురాధ ఆర్ధిక మూలాలు దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు. అఘాయిత్యాలను ప్రశ్నిస్తోందని బెదిరిస్తున్నారు. అనురాధ పోరాటం అందరికీ స్ఫూర్తి కావాలి. తాడోపేడో తేల్చుకోవాలే తప్ప భయపడే ప్రసక్తే లేదు. యువ నాయకత్వం ఎదిగే అవకాశం ఇదే. స్థానిక నేతలుగా యువతను ప్రోత్సహించాలి."

Advertisements

Advertisements

Latest Articles

Most Read