మంగళవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా, తాడిపత్రిలో పర్యటించారు. గత 40 రోజులుగా వైసీపీ నేతల దాడిలో మరణించిన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వటానికి, ఈ పర్యటన చేసారు. తాడిపత్రిలో కిరాతకంగా హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ సభ్యుడు కుటుంబాన్ని కలిసి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సచించమని చెప్పారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, ప్రజలే తగిన శాస్తి చేస్తారని చంద్రబాబు అన్నారు. అన్ని గ్రామాలు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటామని చంద్రబాబు అన్నారు. ఒక పక్క దాడులు చేస్తూ, మరో పక్క తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కార్యకర్తలే కాదని, శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పై, ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పై నా దాడి చేసారని చంద్రబాబు అన్నారు.

మీ గ్రామంలో మీరు ఏకాకి కాదు, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక్క గ్రామానికే చెందిన పార్టీ కాదని, రాష్ట్రం అంతటా ఉందని, అన్ని చోట్లా మీకు అండగా ఉంటామని, మీరు ఆత్మస్థయిర్యంతో ఉండాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఓటమి గురించి ప్రస్తావిస్తూ, ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఒక్కటే అడుగుతున్నారు, మేమంతా మీకే ఓట్లేశాం, ఆ ఓట్లు ఏమైపోయాయి అని అందరూ అడుగుతున్నారు, అయితే ఈ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు చెప్పారు. అనంతపురం జిల్లాకు ఎప్పుడూ లేనంత నీరు ఇచ్చి, కోస్తాకు ధీటుగా చేసామని, అయితే విధి వైపరీత్యం, ఏమి చెయ్యలేమని, ఓడిపోయినా ప్రజల కోసమే పోరాడతామని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read