వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటించనున్నట్లు తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా క్యాడర్‌ సిద్ధంగా ఉండాలని సూచించారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో గెలుపు ఏకపక్షం కావాలని ఆకాంక్షించారు. ‘మళ్లీ టీడీపీ రావాలి’ అనే నినాదం మార్మోగాలని, మళ్లీ రాకుంటే అభివృద్ది ఆగిపోయి, పేదల సంక్షేమం నిలిచిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్టీ నేతలతో ఆయన బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.

kcr 19122018 1

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎక్కడా భేషజాలకు పోకూడదని, గ్రూపు విభేదాలు విడనాడాలని హితవు పలికారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం ఆధిక్యత భారీగా పెరగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ సెమీ క్రిస్మస్ వేడుకగా జరపాలని, ఈ నెల 30న ‘జయహో బీసీ’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ, 5 రాష్ట్రాల్లో ఎక్కడా భాజపా గెలవలేక పోయిందని, 3 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే గెలిచాయని, దేశం మొత్తం మోదీ పాలనను తిరస్కరిస్తోందని వెల్లడించారు.

kcr 19122018 1

ఏపీ మినహా అన్ని రాష్ట్రాల రైతుల్లో అశాంతి నెలకొందని, మైనారిటీల్లో అభద్రత పెరిగిందన్నారు. దేశంలో మూడో కూటమికి ఉనికే లేదని, అది భాజపాకి దొడ్డిదారిన మేలు చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఇది వరకే, థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేసామని, కాని అది సక్సెస్ అవ్వలేదు కాబట్టే, కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో కలుపుకుని వెళ్తున్నమాని అని అన్నారు. మాయావతి లాంటి వారికి కాంగ్రెస్ పార్టీతో ఇబ్బంది ఉన్నా, అందరినీ కలుపుకుని వెళ్తామని, అన్ని పక్షాలు ఇటు వైపు ఉండగా, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ, చీలిక తెచ్చి, మోడీకి లబ్ది చేకూర్చే ప్రయత్నం అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేడ్చల్‌లో సోనియా చెప్పినందునే దాన్ని సాకుగా చూపి కేసీఆర్. సెంటిమెంట్ రెచ్చగొట్టారని చంద్రబాబు అన్నారు. తొలుత హోదాకు అంగీకరించిన తెరాస మళ్లీ అడ్డం తిరిగడాన్ని తప్పుపట్టారు. తెలంగాణలో తెరాస గెలిస్తే.. ఇక్కడ ప్రతిపక్ష నేతలు సంబరాలు చేస్తుకుంటున్నారని, వైకాపా నేతలకు పండుగలా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌కు ఓవైసీ ఎప్పుడు దోస్త్ అయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జగన్‌, ఓవైసీకి మోదీయే దోస్తీ కుదిర్చారా? అని నిలదీశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read