మోడీ వల్లే, కియా కార్ల కంపెనీ మన రాష్ట్రానికి వచ్చింది అని, నిస్సిగ్గుగా వాదిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలకి, ముఖ్యంగా తన ఫేస్బుక్ పేజీలో మోడీ వల్లే, కియా వచ్చింది అని పెట్టుకున్న పురందేశ్వరి గారికి, చంద్రబాబు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు... విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన భాగ‌స్వామ్య స‌ద‌స్సు వివరాలు వివరించటానికి, నిన్న అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు మాట్లాడారు... ఈ సందర్భంగా, కియా మోటార్స్ గురించి చంద్రబాబు చెప్పారు... చాలా మంది కళ్ళు తెరిపించేలా మాట్లాడారు.. అయినా వారు వినరు అనుకోండి... ప్రజలకు తెలియాలి కదా...

cbn kia 28022018 2

ఆయన మాటల్లో "ఇక్కడ కియా మోటార్స్ కోసం ఏ రాష్ట్రం ట్రై చెయ్యలేదా ? అన్ని రాష్ట్రాలు పోటీ పడలేదా ? మరి మన రాష్ట్రానికి, ఇంత పోటీ తట్టుకుని ఎట్లా వచ్చింది ? ఇది మన మీద ఉండే కాన్ఫిడెన్సు... కియా మోటార్స్ రాకుండా, చాలా మంది అడ్డుపడ్డారు... మభ్యపెట్టారు... కాని, వాళ్ళు కూడా అన్నీ ఆలోచించారు... అన్ని రాష్ట్రాల కంటే, ఠిస్ ఇస్ ది మోస్ట్ స్టేబిల్ గవర్నమెంట్.. చాలా ప్రో ఆక్టివ్ గా ఉన్నారు, అని అన్నీ చూసుకుని మన దగ్గరకు వచ్చారు..." అంటూ చంద్రబాబు కియా మోటార్స్ వచ్చిన విధానం పై చెప్పారు...

cbn kia 28022018 3

గత కొద్ది రోజుల నుంచి, రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గు అనేది పూర్తిగా వదిలేసి, ఏమాత్రం ప్రజలు ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా, చంద్రబాబు ఎంతో కష్టపడితే తెచ్చిన కంపెనీని, మోడీ వల్లే రాయలసీమలో పెట్టారు అంటూ, ఒక ఫేక్ ఇమేజ్ పట్టుకుని ప్రచారం మొదలు పెట్టారు... నిన్న పురందేశ్వరి లాంటి నాయకురాలు కూడా, మోడీ వల్లే వచ్చింది అంటూ, నిస్సిగ్గుగా, చంద్రబాబు కష్టాన్ని, మోడీ ఖాతాలో వేసారు.. చంద్రబాబు మాత్రమే కాదు, ఇది వరకు తమిళనాడుకి చెందిన ఒక కన్సల్టెంట్, కియా అన్ని రాష్ట్రాలను కాదని, ఆంధ్రప్రదేశ్ కి ఎలా వచ్చిందో క్లియర్ గా చెప్పారు... అది అప్పట్లో, బాగా వైరల్ అయ్యింది కూడా... ఇప్పటికే, ఇలాగే ఫేక్ ప్రచారం చేసుకుంటూ మోడీని లేపుదాం అనుకుంటే, ఇది 2014 కాదు, మేము ఉత్తరాది వాళ్ళం కాదు... లెక్కకు లెక్క సరైన సమయంలో అప్ప చెప్తాం... కియా మోటార్స్ మా ముఖ్యమంత్రి కష్టం... వారి మాటల్లో వినండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read