ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ పై జరుగుతున్న కుట్రలు, విభజన హామీలు అమలు చెయ్యక పోవటం, సుప్రీం కోర్ట్ లో కేంద్రం వేసిన అఫిడవిట్, బీజేపీ ముసుగు కప్పుకుని పవన్, జగన్ ఆడుతున్న డ్రామాలు... ఇవన్నీ జూలై 18 నుంచి పక్కాగా ఎండగట్టటానికి చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఢిల్లీలో ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల నేపధ్యంలో రాష్ట్రంలో కూడా అదే రోజు నుంచి శాసనసభ, మండలి సమావేశాలను నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజా సమస్యలు, పలు బిల్లులు చర్చకు పెడుతూనే, పార్లమెంట్ లో జరిగే పరిణామాల పై, ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వనున్నారు. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 10 వరకూ జరిగే ఈ సమావేశాల్లో మొత్తం 18 రోజులు ఉభయ సభలు కొలువు తీరాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్ణయించింది. ఇదే సమయంలో ఏపీలో కూడా వర్షాకాల సమావేశాలను నిర్వహించి బీజేపీ సహా ఆపార్టీతో లాలూచీ పడ్డారనే కోణంలో వైసీపీ, జనసేన పార్టీలను ఎండగట్టాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

bjp 1072018 2

పార్లమెంటు సమావేశాలు జరిగిన అన్ని రోజులూ ఇక్కడ అసెంబ్లీ సమావేశాలను జరిపేందుకు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత దీనిపై మరింత కసరత్తు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశంలో ఏపీ పునర్విభజన చట్టం -2014లో పొందుపరచిన విభజన అంశాలు, ఏపీకి ప్రత్యేక తరగతి హోదాపై బీజేపీ చేసిన మోసమే ప్రధాన ఎజెండా కానున్నట్లు తెలిసింది. విభజన చట్ట ప్రకారం అన్నీ చేశామని ఇటీవల సుప్రీమ్‌కోర్డులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఎలాగూ కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని నిర్ణయించినందున ఆయా అంశాలపై జరిగే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌, స్వల్పకాల వ్యవధి చర్చల్లో రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ప్రజాప్రతినిధులు లేవనెత్తే ప్రశ్నలకు మంత్రులు గణాంకాలతో పూర్తి సమాచారం ఇచ్చే విధంగా కార్యాచరణ తయారైనట్లు తెలిసింది.

bjp 1072018 3

అలాగే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ వ్యవహారశైలి, ఎంపీలు రాజీనామాలు చేసినప్పటికీ బీజేపీతో సన్నిహితంగా ఉండడం, కేంద్రమంత్రులతో వరుస భేటీలపై కూడా చర్చించి వైసీపీపై వ్యతిరేక భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం. అలాగే సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు తర్వాత వైసీపీ అధినేత జగన్‌, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లు కేంద్రాన్ని విమర్శించడంలేదని ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న టీడీపీ శ్రేణులు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లోనూ రెండు పార్టీల తీరును ఎండగట్టాలని నిర్ణయానికి వచ్చారు. కేంద్రం సహాయం చేయనప్పటికీ గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలువురు సూచన చేసినట్లు తెలిసింది. అలాగే ప్రశ్నోత్తరాలు, స్వల్పకాల వ్యవధి చర్చలు, జీరో అవర్‌లో ఆయా అంశాల్లో గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, పెన్షన్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ, నిరుద్యోగ భృతి, సంక్షేమకార్యక్రమాలపై విస్తృతంగా, లోతుగా, వివరణాత్మకంగా, ఫలవంతంగా చర్చలు జరపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read