రాష్ట్రంలో ఉన్న సైకోలురెచ్చిపోతూనే ఉన్నారు... పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, వీరి ఆగడాలకు అంతం లేకుండా పోయింది... మొన్నటికి మొన్న, రాష్ట్రం మొత్తం ఆనందంగా, అమరావతిలో, భారత రాష్ట్రపతిని పిలిచి వేడుకలా ఫైబర్ నెట్ కేబుల్ ప్రారంభించిన వేళ, రాష్ట్రంలోని సైకోలు తమ బుద్ధి మరోసారి బయట పెట్టారు.. మన ఆనందం పాడు చెయ్యాలి అనే ఉద్దేశంతో, ఫైబర్ నెట్ కేబుల్ కట్ చేసి తమ పైశాచిక ఆనందం చూపించారు. రాష్ట్రపతి కోవింద్ అమారవతి పర్యటన కార్యక్రమ ప్రసారం కాకుండా దుండగులు ఇంటర్‌నెట్ ఫైబర్ కేబుల్‌ని కట్ చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 6 చోట్ల కేబుల్‌ని కట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
అప్పటి నుంచి, ఇలా ఫైబర్ గ్రిడ్ కేబుల్స్ కత్తిరించటం జరుగుతూనే ఉంది... ఇవాళ కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ విషయం పై స్పందించారు... ఫైబర్ గ్రిడ్ కేబుల్స్ కత్తిరించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించండని ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే వాళ్ళు దేశద్రోహులని సీఎం మండిపడ్డారు. ఇక్కడ సీఎం మాట్లాడుతూ... కిందిస్థాయి అధికారుల సహకారం ఉంటే సస్పెండ్ చేయాలన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు బాగుండాలని ఆయన చెప్పారు. కేసుల దర్యాప్తులో సాంకేతికత ఉపయోగపడాలన్నారు. తప్పు చేసిన వ్యక్తి ఏ స్థాయిలో వున్నా శిక్షపడాల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రతి పేద వాడికి, విజ్ఞానం, వినోదం కూడా అందించాలి అనే లక్ష్యంతో, చంద్రబాబు ప్రభుత్వం ఫైబర్ నెట్ తో, 150 రుపాయిలకే, ఫోన్, టీవీ, ఇంటర్నెట్ కలిపించటం కోసం, కృషి చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే కొన్ని చోట్ల కనెక్షన్ లు కూడా ఇస్తున్నారు... ఇప్పటికే ఈ ఫైబర్ నెట్ మీద కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి... ఈ ప్రాజెక్ట్ ఆపెయ్యాలి అని, కోర్ట్ లో కేసులు కూడా వేసాయి... అయితే వీళ్ళ కుట్రలని కోర్ట్ తిప్పి కొట్టింది... ఇప్పుడు ఇలా కొంత మంది వైర్లు కత్తిరిస్తున్నారు... ఆ సైకోలు ఎవరు అనే విషయం పోలీసులు విచారణ చేసి, ప్రజల చేతే బుద్ధి చెప్పించాలి...