అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో భీమిలి అసెంబ్లీ టికెట్ అవంతి ఆశించినప్పటికీ అనకాపల్లి ఎంపీగా అధిష్టానం బరిలోకి దింపిందని తెలుస్తోంది. ఈసారైనా భీమిలి సీటిస్తారని ఆశించినప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో చర్చించారని త్వరలోనే వైసీపీలో చేరతారని సమాచారం. వైసీపీలోకి వస్తే అవంతి కోరుకున్న భీమిలి అసెంబ్లీ టికెట్టే కాకుండా మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అలెర్టయిన అధిష్టానం ఆయన్ను బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

cbn 14022019

అయితే, ఈరోజు విశాఖపట్నం వైసీపీ నేతలను ఇంటికి పిలిపించుకున్న జగన్.. అవంతి శ్రీనివాస్ చేరికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయమై పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం ఈరోజు అవంతి శ్రీనివాస్ ను కలిసి పార్టీలోకి ఆహ్వానించాలని జిల్లా నేతలకు సూచించారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ నేతలు అవంతి శ్రీనివాస్ ను కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. తనకు భీమిలి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అవంతి టీడీపీ అధిష్ఠానాన్ని కోరగా, ముందస్తు హామీ ఇచ్చేందుకు హైకమాండ్ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే అవంతి శ్రీనివాస్ వైసీపీ నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. కాగా, అవంతికి భీమిలి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.

cbn 14022019

ఇదిలా ఉంటే.. అవంతి కోసం భీమిలి సీటు వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మంత్రి అధిష్ఠానానికి స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. కాగా గురువారం ఉదయం పార్టీనేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలో ఆమంచితో పాటు మరో ఇద్దరు టీడీపీని వీడతారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరు పార్టీ నుంచి వెళ్లినా ఎలాంటి నష్టం లేదని తెలుగుతమ్ముళ్లతో చెప్పారు. ఆమంచి లాంటి వ్యక్తులు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు. ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోలేకపోయారని.. బిజీగా ఉన్నా ఆమంచితో గంట సేపు మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీనేతలకు చంద్రబాబు గుర్తు చేశారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read