ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళటం సహజం. ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చకో, లేదా మరిన్ని అవకాశాలు వస్తాయనో, లేదా మరింతగా ప్రజలకు సేవ చేయాలనో, ఇలా అనేక కారణాలతో పార్టీలు మారుతూ ఉంటారు. అయితే కొంత మంది, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో, అప్పటి వరకు వంగి వంగి దండాలు పెట్టి, నీ అంతటి వాడు లేడు అని భజన చేసి, అన్నం తినే వాడు ఎవరూ ఆ పార్టీలో చేరరు అని ప్రగల్భాలు పలికి, చివరకు అదే పార్టీలో చేరి, చేరి చేరగానే అప్పటి వరకు పొగిడిన నాయకుడిని, అమ్మలక్కలు తిట్టటం చాలా సహజం అయిపొయింది. ఎక్కడో అనామకులుగా ఉన్న వారికి రాజకీయం అవకాసం ఇస్తే, రాజకీయంగా స్థిరపడిన తరువాత, వాళ్ళనే మళ్ళీ తిట్టటం ఇప్పుడు రాజకీయాల్లో ఫ్యాషన్. అయితే ఈ ట్రెండ్ కు కొంత మంది వ్యక్తిరేకం అనే చెప్పాలి. పార్టీ నుంచి వెళ్ళిపోయినా, ఆ నాయకుడిని గౌరవిస్తూ, అన్న లాగా సంబోధిస్తూ, రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడుతున్నారు అంటే, ఇలాంటి వారి వల్లే. అలంటి వారిలో ఒకరు తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఎమ్మెల్యే సీతక్క, నక్సల్స్ లో ఉండే వారు. తరువాత పరిణామాలతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈ సందర్భంగా, అప్పట్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆమెకు రాజకీయంగా అవకాసం ఇచ్చారు.
అనేక పార్టీ పదవులు ఇచ్చారు, తరువాత ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. తరువాత జరిగిన అనేక పరిణామాలలో సీతక్క పార్టీ మారారు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే అందరిలాగా పార్టీ మారేప్పుడు అధినేతను తిట్టలేదు.ఎందుకు మారుతున్నమో ఆయనకు చెప్పి వెళ్ళిపోయారు. తరువాత ఆమె ఒక ఎమ్మల్యేగా మంచి పేరు తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా క-రో-నా సమయంలో మారుమూల పల్లెల్లో ఆమె సేవలు దేశ వ్యాప్తంగా ప్రసంసలు అందుకున్నాయి. అయితే ఈ మధ్య సీతక్క తల్లి అనారోగ్య బారిన పడటంతో, ఆమెకు హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ లో చికిత్స జరుగుతుంది. అయితే విషయం తెలుసుకున్న చంద్రబాబు ఈ రోజు అక్కడకు వెళ్లి సీతక్కను పరామర్శించారు. చంద్రబాబు రావటంతో, సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ ఉన్న డాక్టర్లకు, ఆమె పోరాట స్పూర్తి గురించి చంద్రబాబు చెప్పారు. ఈ సీన్ చూసిన ప్రజలు, వేరే వేరే పార్టీలు అయినా, రాజకీయ నాయకులు ఇలా ఉండాలని, ఒకరిని ఒకరుకు గౌరవించుకుంటే, రాజకీయం ఎంతో హుందాగా ఉంటుందని, చంద్రబాబుని, సీతక్కని అభినంధించారు.