కేరళ వరద బాధితులకు రాష్ట్రం నుంచి అందిస్తున్న సహాయంలో భాగంగా గుంటూరు జిల్లా వాసులు అందించిన విరాళాలతో కొనుగోలు చేసిన 10వేల కిట్లను శుక్రవారం ఉదయం ఆ రాష్ట్రానికి పంపారు. ఈ కిట్ల లోడుతో వెళుతున్న లారీల‌కు సచివాలయం 1వ బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా దాతలను, కలెక్టర్ కోన శశిధర్‌ని, సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడు అభినందించారు. ఒక కుటుంబానికి కావలసిన ముఖ్యమైన 30 వస్తువులను మూత ఉన్న బక్కెట్‌లో ఉంచి కిట్‌గా తయారుచేశారు.

kreala 24082018 3

ఈ కిట్ల మొత్తం విలువ రూ.1.5 కోట్లని, ఒక్కో కిట్ ఖరీదు రూ.1400 అని అధికారులు చెప్పారు. ఈ బక్కెట్లలో చీర, టవల్, లుంగీ, నైటీ, పళ్లెం, గ్లాస్, గెరిట, కందిపప్పు, పంచదార, ఉప్పు, కాపీ పొడి, సబ్బులు, టూత్ పేస్ట్, బ్రెష్ లు, గొదుమ పిండి, టార్చ్ లైట్, పసుపు, కారం, కొబ్బరి నూనె, కొవ్వొత్తులు, దోమల మందు కాయిల్స్ వంటి వాటిని ఉంచారు. ఇటువంటి పదివేల బక్కెట్లను పది ట్రక్కులలో నింపి కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు పంపుతున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చెప్పారు. ఆ జిల్లా కలెక్టర్‌తో కూడా మాట్లాడినట్లు ఆయన చెప్పారు. అక్కడ 4 లక్షల కుటుంబాలు నిరాశ్రయులైనట్లు తెలిపారు. వారికి కావలసినవి ఏమిటో తెలుసుకొని ఈ కిట్లు తయారుచేసినట్లు చెప్పారు.

kreala 24082018 2

సంఘం డైరీ తరపున ఎమ్మెల్యే నరేంద్ర 10,800 లీటర్ల టెట్రా ప్యాకెట్ పాలను అందజేసినట్లు తెలిపారు. 3 నుంచి 6 నెలలు నిల్వ ఉంటే ఈ పాలను కూడా కేరళ పంపినట్లు తెలిపారు. ఈ కిట్లతో పాటు గుంటూరు జిల్లా ప్రజల తరపున బాధితులకు ‘‘మీరు తొందరగా కోలుకోవాలి’’అని ఒక సందేశం కూడా పంపినట్లు చెప్పారు. ఈ ట్రక్కులు సకాలానికి బాధితులకు చేరే విధంగా రవాణాలో ఎటువంటి ఆటంకాలు కల‌గకుండా పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్ అధికారులను పంపినట్లు వివరించారు. దాతలు ఇంకా సహాయం అందజేయడానికి ముందుకు వస్తున్నారని, మరోసారి కూడా ఇటువంటి ట్రక్కులు పంపుతామని కలెక్టర్ చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read