ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే హైదరాబాద్ లో కూర్చునే ప్రతి ఒక్కడికే అలుసే.. చంద్రబాబు మంచితనాన్ని, హుందా తనాన్ని, చేతకాని తనంగా తీసుకుని, ఇష్టం వచ్చినట్టు వాగాతమే ఆ హైదరబాద్ బ్యాచ్ చేసే పని... నంది అవార్డుల విషయంలో అది పరాకాష్టకు చేరింది... ఈ సినిమా వాళ్ళ గోలకు తోడు, హైదరబాద్ మీడియా చానల్స్ కూడా రెచ్చిపోయాయి... సినిమా అవార్డులకి కులం ఆపాదించి, హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ లో అభిమానుల మధ్య కులం చిచ్చు పెట్టే ప్రయత్నం చేసాయి... ఏ నాడు ఆంధ్రప్రదేశ్ వంక కన్నెత్తి చూడని, బజారు గాళ్ళు కూడా, చంద్రబాబుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ లో కూర్చుని వాగారు... సహనం నశిస్తే ఏమి అవుతుందో, ఇవాళ ప్రభుత్వ స్పందన చుస్తే అర్ధమవుతుంది...

award 19112017 2

నంది అవార్డుల వివాదం పై, కొంత మంది ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వ్యాఖ్యల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కార్‌ సీరియస్‌ అయింది. ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించే వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రం మూడేళ్ల అవార్డులు ప్రకటించినా వివాదం చెలరేగడం పై ప్రభుత్వ పెద్దలు మనస్థాపం చెందారు. కళాకారులను గౌరవించాలన్న సదుద్దేశాన్ని అర్ధం చేసుకోలేదని విచారం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడం కోసమే అవార్డుల ప్రకటన అన్నారు.

award 19112017 3

అవార్డు గ్రహీతలెవరూ ప్రస్తుతం ఏపీకి చెందినవారు కాదని. దాదాపు అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారేనని, వీరిలోఎవరికీ కనీసం ఏపీలో ఓటు హక్కు కూడా లేదని చెప్పారు. కేవలం తెలుగు సినిమా అన్న కారణంగానే అందరికీ అవార్డులు ఇచ్చామని అన్నారు. బాలీవుడ్‌ సినిమాలు ఏపీలో రిలీజ్‌ అవుతున్నా అవార్డులు ఇవ్వడం లేదు కదా అని ప్రశ్నించారు. లేని దురుద్దేశాలు అంటగడుతూ, హైదరాబాద్ లో కూర్చుని రాళ్ళు వేస్తే, అవార్డుల రద్దుకైనా వెనుకాడబోమని ప్రభుత్వం హెచ్చరించింది..

Advertisements

Advertisements

Latest Articles

Most Read