పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు భరిస్తూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తన సహజ ధోరణికి భిన్నంగా స్పందించారు... ఏంటో ఓర్పుగా ఉండే చంద్రబాబు, ఇవాళ కేంద్రం పోలవరం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాఫర్‌ డ్యామ్‌ ఆపమని ఉత్తరం రాయటంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు... ఇవాళ సాయంత్రం అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన చంద్రబాబు, తీవ్రంగా స్పందించారు... మిత్రపక్షం కాబట్టే మరింత సహనంగా వ్యవహరిస్తున్నా, పోలవరం జోలికి వస్తుంటే మాత్రం తట్టుకోలేను అంటూ, బాధని వ్యక్తం చేశారు..

cbn serious 30112017 1

అంతే కాదు, అందరూ ఆశ్చర్యపోయేలా, పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం ఆపమంటే ఆపేస్తామని వ్యాఖ్యానించారు. కేంద్రం అదే వైఖరితో ఉంటే వాళ్ళకే అప్పజెప్పి నమస్కారం పెడతానని పేర్కొన్నారు... ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా, అక్కడ విలేకరులు ఖంగు తిన్నారు...ప్రాజెక్ట్ పనులు ఆరునెలలపాటు ఆగిపోతే మళ్ళీ దారి పట్టించడం కష్టమని సీఎం తేల్చిచెప్పారు. పోలవరంపై ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్థం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు...

cbn serious 30112017 2

కేంద్రం సహకరిస్తే సరే...లేకుంటే మన కష్టమే మిగులుతుందని మీడియాకు ఆయన వివరించారు. విభజన హామీల సాధనలో రాజకీయం చేయనని చంద్రబాబు తేల్చిచెప్పారు. "నేను ఆశావాదిని....నా పని నేను చేస్తా.. మిత్రపక్షం కాబట్టే మరింత సహనంగా వ్యవహరిస్తున్నా" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేస్తానంటే ఇప్పటికిప్పుడే కేంద్రానికి అప్పగిస్తామన్నారు. కేంద్రం ముందుకొస్తే తనకెలాంటి భేషజాలు లేవని సీఎం స్పష్టం చేశారు. "పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నీతి ఆయోగ్ చెప్పింది.. నేనేమీ కావాలని తీసుకోలేదు" అని చంద్రబాబు చెప్పారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read