ఎన్నికల కోడ్‌ నీడలో రాజ్యమేలుతున్న అధికారుల్లో కొందరు రాబోయేది వైకాపా ప్రభుత్వమేనని భావించి, కొన్ని కీలక ఫైళ్ళను ఇప్పటికే ఆ పార్టీ నేతలకు చేరవేశారన్న ఆరోపణలు ఒకవైపు దుమారం రేపుతుండగా, మరోవైపు సొంత పార్టీ నేతలు కోవర్టులుగా మారి పార్టీకి ద్రోహం తలపెట్టారన్న వార్తలు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును కలవరుపాటుకు గురిచేస్తున్నాయి. ఈనేపథ్యంలో పార్టీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షల్లో… కోవర్టుల ఏరివేతకు సిద్ధమైనట్టు తెలిసింది. అదేవిధంగా ప్రభుత్వ వ్యవహారాల డేటా చోరీని కూడా ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. కౌంటింగ్‌ సమయం దగ్గరపడుతున్న తరుణంలో అనేక కీలక పరిణామాలు రోజురోజుకు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్‌ పేరుతో సాధారణ పరిపాలన కార్యక్రమాలకు దాదాపుగా బ్రేకులు పడ్డాయి. మరోవైపు అందరి దృష్టి ఎన్నికల ఫలితాలు వాటి అంచనాలపైనే ఉంది.

cbn 11052019

ఇదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం ప్రతిపక్షానికి అందిస్తున్నారంటూ మరోకొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కొందరు అధికారులు అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన ఐదేళ్ళలో ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని విపక్షాలకు అందిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ ఇంకా అమలులో ఉండడంతో ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు సైతం సచివాలయానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం పూర్తిగా అధికారుల పాలనే రాష్ట్రంలో సాగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు ఎన్నికల ఫలితాలు రాకమునుపే సర్వే నివేదికల ఆధారంగా ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపాకు తమ వంతు సహకారం అందిస్తున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వైకాపా అధినేత జగన్‌కు దగ్గరయ్యేందుకు ఇలాంటి నీతిమాలిన పనులను కొందరు అధికారులు చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని విపక్షాలకు అందజేస్తున్నారన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

cbn 11052019

ఏయే శాఖలకు సంబంధించిన సమాచారాన్ని విపక్షాలకు చేరవేశారన్న విషయాన్ని తెలుసుకునే పనిలో ఆయన ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తనకు అందజేయాలని నిఘా వర్గాలను ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా సమాచారం. గడిచిన ఐదేళ్ళుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన సమాచారం ఏ విధంగా ప్రత్యర్థులకు చేరవేశారో అన్న అంశానికి సంబంధించిన సమగ్ర నివేదికను తెప్పించుకుంటున్నారు. ఒకవేళ సమాచారాన్ని విపక్షాలకు అందించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ముఖ్య నేతలతో ఇప్పటికే చంద్రబాబు చర్చించినట్లుగా చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న పరిణామాలపై వారితో సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పార్టీలోనే ఉంటూ కోవర్టులుగా మారిన నేతలపై కూడా అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరు కోవర్టులుగా వ్యవహరించారో వారందరి వివరాలను ఇప్పటికే తెప్పించుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read