ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత పార్టీ ఎమ్మల్యేల పై ఫైర్ అయ్యారు... అమరావతిలో శనివారం జరిగిన ప్రభుత్వం-పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు... సంక్రాంతి పండుగకు కోడి పందేల్లో కొన్ని చోట్ల స్వయంగా అధికార పార్టీ ఎమ్మల్యేల ఆధ్వర్యంలో జరగటం పై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు... ఎమ్మల్యేలుగా మీకు వాటితో పని ఏంటి ? కోడి పందాలు వెయ్యటం మీ పనా ? మీరే ఇలాంటి పనులు చేసి ఏమి సందేశం ఇస్తున్నారు ? పార్టీ ప్రతిష్ఠను ఏం చేద్దామనుకుంటున్నారు?’ అంటూ మండిపడ్డారు...
‘‘గతంలో ఎక్కడో తోటల్లో, పాకల్లో కోడి పందేలు జరిగేవి. ఇప్పుడు ప్రతిచోటా జాతర మాదిరి చేశారు. ఎమ్మెల్యేలు దగ్గరుండి ఆడించారు. పైగా టీవీల ముందుకొచ్చి మేమే పెట్టించామని ఘనంగా ప్రకటనలు చేశారు. ఆ పందేలు ఏమిటి? వాటి దగ్గర బల్లలేమిటి? ఈ సంప్రదాయం లేని జిల్లాలకు కూడా పాకిస్తున్నారు. ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ఠ ఏం కావాలి? ప్రభుత్వమే వీటిని ఆడిస్తోందని చెడ్డపేరు తేవాలనుకుంటున్నారా? అంటూ మండి పడ్డారు...
నేను ఒక పక్క కష్టాలలో ఉన్న రాష్ట్రాన్ని, జాగ్రత్తగా, ఎలాంటి మచ్చ లేకుండా, ప్రజల్లో ప్రతిష్ఠ పెంచుకుంటూ, పోజిటివ్ వైబ్రేషన్స్ తెస్తూ, మచ్చ పడకుండా పని చేస్తుంటే, కొంత మంది చర్యల వల్ల నష్టం వస్తుంది అని, చేసిన మంచి పని మీద ఎఫెక్ట్ పడుతుంది అని అన్నారు... ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాలని ప్రజలు పెద్దగా పట్టించుకోరు అని, అలాంటిది మొన్న జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం చుస్తే ఎంతో సంతోషం వేస్తుంది అని, ప్రజల్లో మనకి ఉన్న ఆదరణ అది, దానిని పాడు చేద్దామని అనుకుంటున్నారా’’ అని చంద్రబాబు సీరియస్ అయ్యారు... ఈ సందర్భంలో ఒక్క ఎమ్మెల్యేలు కూడా, ఎదురు మాట్లాడలేదు... చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని తెలుసుకుని, మౌనంగా ఉండి పోయారు...