గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ప్రమాణ స్వీకారం గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీఅధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మిత్ర పక్షాలు నుంచి మాత్రం బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మాత్రమే హాజరయ్యారు. ఎన్డీఏలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పిలుపు వచ్చినా చంద్రబాబు వెళ్ళలేదు... బదులుగా, ఆర్థిక, శాసన వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రాతినిధ్యం వహించారు..

modi cbn 27122017 2

చంద్రబాబు అంతకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి సోనోవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం వేడుకలకు హాజరయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, వైస్ ప్రెసిడెంట్ ఎం. వెంకయ్యనాయుడు తదితరులు ప్రమాణస్వీకారం వేడుకలకూ హాజరయ్యారు. ఈ సారి చంద్రబాబు, గుజరాత్‌ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వేడుకులకు హాజరు కాకపోవటం చర్చనీయాంశం అయ్యింది. నేషనల్ మీడియా కూడా దీని పై కధనాలు ప్రచురించింది. ముఖ్యంగా మిత్ర పక్షాలు నుంచి మాత్రం బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మాత్రమే హాజరు అవ్వటంతో నేషనల్ మీడియా ఫోకస్ కూడా దీని మీద పడింది.

modi cbn 27122017 3

నిజానికి చంద్రబాబు గుజరాత్‌ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వేడుకులకు హాజరు కాకుండా, ప్రధాని నరేంద్ర మోడీకి తన అసంతృప్తి ఈ విధంగా చూపించారు అనే వాదన వినపడుతుంది. అందుకే మిత్ర పక్షం కనుక, ఆర్థిక, శాసన వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుని తన బదులుగా పంపించి, తన అసంతృప్తి తెలియచేసారు. పోలవరం విషయంలో కేంద్రం పెడుతున్న ఇబ్బందులు, చంద్రబాబుకి చికాకు తెప్పిస్తున్నాయి. పోలవరం విషయంలో ఎవరు అడ్డు పడినా ఎంత వరకు అయినా వెళ్తాను అంటున్న చంద్రబాబు, కేంద్రం పెడుతున్న ఇబ్బందుల పై, ఈ విధంగా తన అసంతృప్తి తెలియచేసారు. మరి మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ తన విలువైన మిత్రుడి అసంతృప్తిని పోగొడుతుందో లేదో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read