ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ మహానాడులో చంద్రబాబు ప్రారంభోన్యాసం చేశారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. విభజన హామీలు నేరవేర్చమంటే, మన రాష్ట్రం పై ఇంత కుట్ర చేస్తున్నారని చెప్పారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆభరణాల అంశంలో కొనసాగుతున్న వివాదం వెనుక భాజపా కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు భాజపా తెరవెనుకు కుట్ర పన్నుతోందన్నారు. తిరుమల ఆలయాన్ని పురావస్తు శాఖ ద్వారా స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నించిందని... ప్రజా వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గి నాలుక కరుచుకుందని తెలిపారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎవరైనా మట్టి కరవాల్సిందేనని అన్నారు.

cbn 27052018 2

బీజేపీ ప్రభుత్వంలో మాటలు ఎక్కువ.. పనులు తక్కువ అని వ్యాఖ్యానించారు. మోదీ ప్రచార ప్రధానమంత్రి మాత్రమే అని ఎద్దేవా చేశారు. మోదీ పథకాలతో ఎవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే నోట్ల రద్దుకు మద్దతు పలికామని, కానీ ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగే దౌర్భాగ్యం దాపురించిందని చంద్రబాబు అన్నారు. జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడిందన్నారు. ప్రధాని మోదీ చర్యలతో పాలన గాడి తప్పిందని విరుచుకుపడ్డారు.

cbn 27052018 3

దేశంలో బీజేపీ కలుషిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేస్తూ ఆడియో టేపుల ద్వారా అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. విలువల గురించి బీజేపీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. తమిళనాడులో శశికళకు పట్టిన గతి పడుతుందని విపక్షనేతకు భయమని... అందుకే హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. దిగజారి పోయి, తిరుమల పై కుట్రలు పన్నుతున్నారని, వెంకన్న జోలికి వస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నవారు ఎవరూ బాగుపడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read