ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో, ఎంత ఘోరంగా ఉందో చెప్పే సంఘటన ఇది. సామాన్య ప్రజలకే దిక్కు లేక, అధికారులకు కూడా హక్కులు లేక, బ్రతుకుతున్న ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. మొన్నటి వరకు చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లారు, చంద్రబాబు పార్టీ ఆఫీస్ మీదకు వెళ్లారు, ఇలా రకరకాలుగా చేసిన వాళ్ళు, ఇప్పుడు ఏకంగా చంద్రబాబు స్థలం కూడా కబ్జా చేయాలని చూడటం పెద్ద షాక్ అనే చెప్పాలి. నారావారి పల్లె అనేది చంద్రబాబు సొంత ఊరు అనేదికి అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు నారావారి పల్లెలో కొంత భూమి ఉంది. ఆయన ప్రతి సారి తన ఆస్తుల జాబితాలో ఇది కూడా చెప్తూ వచ్చేవారు. అయితే ఇప్పుడు నారావారి పల్లెలో ఉన్న భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసారు అనే వార్తలు రాష్ట్రంలో సెన్సేషన్ అయ్యాయి. చంద్రబాబుకు నారా వారి పల్లెలో ఉన్న భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే నెంబర్ 222/5లో చంద్రబాబు పేరిట ఉన్న 38 సెంట్ల భూమని కబ్జా చేసే ప్రయత్నం చేసారు డుండగులు. చంద్రబాబు స్థలంలో, రాతి కూసాలను కబ్జాదారులు నాటేసి, స్థలం మొత్తం లాగేసే ప్రయత్నం హ్సుస్తున్నారు.
1989లో 87 సెంట్ల రిజిస్టర్ భూమిని, చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు కొనుగోలు చేసారు. అయితే తరువాత ఆ భూమి చంద్రబాబు పేరిట వచ్చింది. ఆ భూమిలో కొంత భాగాన్ని, ప్రజల అవసరాల కోసం అని చెప్పి, చంద్రబాబు ఆస్పత్రి, కల్యాణ మండపానికి ఇచ్చారు. అయితే చంద్రబాబు మంచి పని కోసం, ఇచ్చిన భూమి పైన, కొంత మంది కబ్జా దారుల కన్ను పడింది. ఏకంగా చంద్రబాబు భూమికే టెండర్ పెట్టారు. చంద్రబాబు ఇచ్చిన 38 సెంట్ల భూమిలో ఏకంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడి వారు షాక్ తిన్నారు. ఏకంగా చంద్రబాబు కు చెందిన భూమినే కబ్జా చేస్తూ ఉండటంతో, వెంటనే సమాచారాన్ని చంద్రబాబుకు అందించారు. దీని పైన ముందు పోలీసులకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. అయితే ఇది ఒక పక్క ఉంటే, అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పటానికి, ఇది ఒక ఉదాహరణ. చంద్రబాబుకే రక్షణ లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు అందరి ప్రశ్న.