2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలు అని, ముద్రగడ జాతి కోసం యాత్రలు అని ట్రైన్ తగలు బెట్టటం, ప్రత్యెక హోదా పోరాటం అని చలసాని శ్రీనివాస్ హడావిడి, మరో వైపు ఉండవల్లి, రమణ దీక్షితులు, మోత్కుపల్లి, లాంటి వాళ్ళు, ఇక అందరి కంటే మించి మూడు వేల కిమీ పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి. వీళ్ళ పర్యటనలను చంద్రబాబు స్వేఛ్చగా చేసుకోనిచ్చారు. జగన్ రెడ్డి వైజాగ్ లో జరుగుతున్న సమిట్ ని భగ్నం చేస్తున్నారని సమాచారం ఉండటంతో, ఒకే ఒకసారి ఆయన్ను అడ్డుకున్నారు అంతే. అంత స్వేచ్చగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పట్లో ప్రతిపక్షాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు ప్రజాస్వామ్యానికి విలువు ఇస్తారు కాబట్టి. ప్రతిపక్షం బలంగా ఉంటేనే రాష్ట్రం బాగుటుందని నమ్మేవారు కాబట్టి. కానీ ఇప్పుడు జరుగుతుంది మాత్రం, వేరు. చంద్రబాబు అధికారం కోల్పోయారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి, జగన్ మోహన్ రెడ్డి అనేక తప్పులు చేస్తున్నారు. వీటి పై సహజంగానే ప్రతిపక్షాలు, ప్రజల తరుపున పోరాటం చేస్తాయి. ఇందులో ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పాత్ర చాలా ఎక్కువ. అందులోనూ ప్రజా పోరాటాల కోసం, చంద్రబాబు ఎప్పుడూ ముందు ఉంటారు.

ఈ 21 నెలల్లో చంద్రబాబుని, ఎనిమిది సార్లు అడ్డుకున్నారు జగన మోహన్ రెడ్డి. మొదటి సారిగా, ఇసుక కొరత పై, దీక్ష పెడితే, హౌస్ అరెస్ట్ అన్నారు. తరువాత చలో ఆత్మకూరు అంటే, హౌస్ అరెస్ట్ అన్నారు. ఆయన ఇంటికి తాడులు కట్టి మరీ నిర్బందించారు. తరువాత అమరావతి జేఏసీ బస్సులు ఆపిన చోటుకు వెళ్తాం అంటే, అరెస్ట్ చేసారు. ఆయన రాత్రి పూట బెంజ్ సర్కిల్ లో కూర్చోవాల్సిన పరిస్థితి. తరువాత, మందడంలో రైతులు పై లాఠీచార్జ్ చేసారు, పరామర్శిస్తాం అంటే, అరెస్ట్ చేసారు. ఆయన్ను రాత్రి పూట అన్ని ఊళ్ళు తిప్పుతూ, అర్ధరాత్రి వదిలి పెట్టారు. తరువాత అమరావతి పరిరక్షణ మీటింగ్ కోసం, తెనాలి వెళ్తాం అంటే, అరెస్ట్ చేస్తాం అని ఆపారు. ఆ తరువాత విశాఖలో మీ భూదందాల బారిన పడిన ప్రజల సమస్యలు వినటానికి వస్తే, అరెస్ట్ చేసారు. చివరి డీజీపీ కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత రామతీర్ధం ఘటనలో కూడా, చంద్రబాబుకు పర్మిషన్ ఇచ్చి, ఆపే ప్రయత్నం చేసారు. ఇప్పుడు తాజాగా చిత్తూరు సంగతి. ఇన్ని సార్లు చంద్రబాబుని బయటకు వెళ్ళనివ్వకుండా ఆపేసారు. అయితే, ఇలా ఆపి, జగన్ రెడ్డి సాధించింది ఏమిటి అంటే, ఏమి లేదు. జగన్ మోహన్ రెడ్డి, తన స్వభావం బయట పెట్టుకుంటున్నారు. చంద్రబాబుని వదిలేస్తే, ఒక రెండు కాలమ్స్ న్యూస్ అయ్యేది, ఇలా అడ్డుకుని బ్యానేర్ ఐటెంగా చేసి, ఆయన దేని పై పోరాడుతున్నారో, ప్రజలందరికీ అర్ధం అయ్యేలా చేస్తున్నారు జగన్ మొహన్ రెడ్డి అండ్ బ్యాచ్.

Advertisements

Advertisements

Latest Articles

Most Read