67 వయసులో, సప్త సముద్రాలు దాటి, మూడు దేశాలు తిరిగి, ఒక్క రోజు కూడా వ్యక్తిగతంగా ఉపయోగించక, 10 రోజులు నుంచి విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి, విసుగు ఆంటే తెలియదు... విరామం అంటే ఎరుగడు... ప్రజా సంక్షేమమే ఊపిరి... రాష్ట్ర అబివృద్దే ధ్యేయంతో పని చేస్తున్నారు...పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలుగా అనువైన ప్రదేశమని తనని కలిసిన పారిశ్రామికవేత్తలతో చెప్తున్నారు... ఏపీలో పెట్టే పెట్టుబడులు సురక్షితం, లాభదాయకమని, నాది భరోసా అని ధీమా ఇస్తున్నారు..
మూడురోజుల పర్యటన కోసం లండన్ విచ్చేసిన ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఇక్కడి ప్రఖ్యాత ‘ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ డైరెక్టర్స్’ (ఐవోడీ) వివిధ సంస్థల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కీలకోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి కొత్త రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక ప్రముఖులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గోల్డెన్ పీకాక్ పురస్కారం అందుకోవడానికి కొద్దిసేపు ముందు ఈ సమావేశాన్ని జరిపారు. త్వరత్వరగా రెండంకెల వృద్ధి రేటు అందుకున్న ఆంధ్రప్రదేశ్ వరుసగా 15 ఏళ్ల పాటు సుస్థిరంగా వుండేలా 15 శాతం వృద్ధి లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటోందని చెప్పారు. దేశానికి మధ్యభాగాన ఉండటం, సుదీర్ఘమైన సముద్రతీరాన్ని కలిగివుండటం తమకు కలిసి వచ్చే అంశాలని గుర్తుచేశారు. రైలు మార్గాలు, రహదారులు, జల రవాణా సదుపాయాలతో దేశం మొత్తానికి అనుసంధానం కలిగి వున్నామని తెలిపారు. కాకినాడ-పాండిచ్ఛేరి జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆటోమోబైల్ పరిశ్రమలో వేళ్లూనుకుని ఉన్నామని, ఆగ్రో ప్రాసెస్ రంగంలో అగ్రపథానికి చేరుకున్నామని వివరించారు.
నిరంతర విద్యుత్ సరఫరాలో దేశానికే ఉత్తమ నమూనాగా నిలిచామని ముఖ్యమంత్రి చెప్పారు. సౌర విద్యుత్ వ్యవస్థలో ఆధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకుంటూ నిల్వ సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. సౌర నిల్వ వ్యవస్థను ఏర్పరచుకుంటే ఇక తమకు తిరుగే ఉండబోదన్నారు. చౌక ధరలో నాణ్యమైన సరఫరా చేయగలగడమే కాకుండా ప్రపంచంతో పోటీ పడే స్థాయిని త్వరలోనే అందుకోగలుగుతామన్నారు. దేశంలో తొలి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరాన్ని నిర్మించుకుంటున్నామని చెప్పారు. గతంలో సైబరాబాద్ వంటి ప్రపంచస్థాయి నగర నిర్మాణంలో సాధించిన అనుభవంతో మరో అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇది వైజ్ఞానిక, పర్యాటక నగరంగా అందరికీ ఒక ముఖ్య గమ్యస్థానంగా నిలవగలదన్నారు. 9 నగరాలు, 27 టౌన్‌షిప్పులతో అమరావతి అత్యద్భుత నగరంగా రూపొందుతోందని చెప్పారు. ‘అమరావతిలో ఏం జరుగుతోందో గమనించి అక్కడికి వచ్చి మీ పెట్టుబడులు పెట్టండి, మేము చెప్పింది వాస్తవమేనని మీరు తప్పకుండా అంగీకరిస్తారు’ అని ముఖ్యమంత్రి అన్నారు. సహజ వనరులు, నైపుణ్యం గల మానవ వనరులు, వ్యాపార సానుకూలతలు వున్న ప్రదేశం ఇండియాలో తమదేనన్నారు.